సర్వీసే లేదు కానీ బిల్లు పేలిపోయింది..కశ్మీరీలకు టెలికాం కంపెనీల షాక్!

సర్వీసే లేదు కానీ బిల్లు పేలిపోయింది..కశ్మీరీలకు టెలికాం కంపెనీల షాక్!

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి శాంతి భద్రతల ద‌ృష్యా..అక్కడ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. గత 47 రోజులుగా అక్కడి ప్రజలకు ఎటువంటి కమ్యూనికేషన్ వాహకాలు అందుబాటులో లేవు. అయితే సర్వీసులు లేకపోయినా టెలికాం కంపెనీలు భారీగా బిల్లులు పంపితున్నాయంటూ కాశ్మీరీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ ఆగష్టు 5 నుంచి ఫోన్ సర్వీసులు నిలిపివేశారు. ‘ మొబైల్ […]

Ram Naramaneni

|

Sep 21, 2019 | 6:26 PM

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి శాంతి భద్రతల ద‌ృష్యా..అక్కడ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. గత 47 రోజులుగా అక్కడి ప్రజలకు ఎటువంటి కమ్యూనికేషన్ వాహకాలు అందుబాటులో లేవు. అయితే సర్వీసులు లేకపోయినా టెలికాం కంపెనీలు భారీగా బిల్లులు పంపితున్నాయంటూ కాశ్మీరీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ ఆగష్టు 5 నుంచి ఫోన్ సర్వీసులు నిలిపివేశారు.

‘ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులు ఎప్పట్నుంచో ఆపేశారు. అయినా నాకు ఎయిర్‌టెల్ నుంచి రూ.779 బిల్లు వచ్చింది. సర్వీసులు ఇవ్వకపోయినప్పటికి బిల్లులు ఎందుకు పంపిస్తున్నారో తెలియడం లేదు’ అంటూ అక్కడి ఒబైద్ నబీ అనే వ్యక్తి వాపోయాడు.

అదే బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ ఉన్న మహ్మద్ ఉమర్ అనే వ్యక్తి తనకు రూ. 380 బిల్లు వచ్చిందని తెల్పాడు. కాగా 2016లో నిరసనలు జరిగిన సమయంలోనూ టెలికాం సర్వీసులు నిలిపివేశారని కానీ అప్పుడు బిల్లుల నుంచి మినహాయింపు ఇచ్చారని అక్కడి ప్రజలు చెప్తున్నారు. వీటిపై పలు టెలికాం కంపెనీలను సంప్రదించనప్పటికి వివరణ ఇవ్వడంలేదని..ప్రీ పెయిడ్ యూజర్స్ పేర్కున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu