AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్యం పేరుతో బాలికపై నిజామాబాద్ బాబా అత్యాచారం

నిజామాబాద్‌లో దొంగ బాబా పాపం పండింది. గత కొంతకాలంగా పూసలగల్లీలో చిన్న పత్రిక నడిపిస్తూ పనిలోపనిగా భూత వైద్యం కూడా చేసేస్తున్నాడీ దొంగ బాబా. మెడిటేషన్‌తో అనారోగ్య సమస్యలు తీరుస్తానని మాయమాటలు చెబుతూ మహిళలను లొంగదీసుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఇటీవల అనారోగ్యంతో మెట్‌పల్లి కి చెందిన తల్లీ, కూతురు ఈ బాబా ను ఆశ్రయించారు. మాయమాటలు చెప్పి తల్లీకూతుళ్లను లోబర్చుకున్నాడీ ప్రబుద్ధుడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తు మందు ఇచ్చి వివస్త్రగా మార్చి లైంగికదాడికి పాల్పడేవాడని […]

వైద్యం పేరుతో బాలికపై నిజామాబాద్ బాబా అత్యాచారం
Venkata Narayana
|

Updated on: Oct 13, 2020 | 2:36 PM

Share

నిజామాబాద్‌లో దొంగ బాబా పాపం పండింది. గత కొంతకాలంగా పూసలగల్లీలో చిన్న పత్రిక నడిపిస్తూ పనిలోపనిగా భూత వైద్యం కూడా చేసేస్తున్నాడీ దొంగ బాబా. మెడిటేషన్‌తో అనారోగ్య సమస్యలు తీరుస్తానని మాయమాటలు చెబుతూ మహిళలను లొంగదీసుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఇటీవల అనారోగ్యంతో మెట్‌పల్లి కి చెందిన తల్లీ, కూతురు ఈ బాబా ను ఆశ్రయించారు. మాయమాటలు చెప్పి తల్లీకూతుళ్లను లోబర్చుకున్నాడీ ప్రబుద్ధుడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తు మందు ఇచ్చి వివస్త్రగా మార్చి లైంగికదాడికి పాల్పడేవాడని తెలుస్తోంది. మూడు నెలలుగా బాలికపై బాబా అత్యాచారం కొనసాగించాడు.

అయితే, కూతురికి కడుపునొప్పి రావడంతో బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక మూడు నెలల గర్భవతి అని వైద్యులు చెప్పడంతో దొంగబాబా అకృత్యం బయటపడింది. ఈ దారుణాన్ని తెలుసుకున్న మహిళా సంఘాలు, బాధితురాలి కుటుంబసభ్యులతో కలిసి ఈ ఉదయం బాబా కార్యాలయంకు వచ్చి దొంగబాబాను చితకబాదారు. దీంతో బాబా రోడ్డు పై పరుగులు పెట్టాడు. మొత్తానికి చిక్కిన బాబాను పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించిన పోలీసులు.. దొంగ బాబాను లోపలేశారు.

Follow Us
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!