కుక్క కోసం బెయిల్ అడిగిన నీరవ్ మోడీ..!

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీను కొద్ది రోజుల క్రిందట బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన మోడీకి బెయిల్ సంపాదించేందుకు ఆయన న్యాయవాదుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతడి తరపు న్యాయవాది వింతైన వాదన వినిపించారు. నీరవ్ మోడీకి కుక్క ఉందని, దాని బాగోగులు చూసుకోవడానికి మోడీకి బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్ధించారు. అయితే ఈ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు […]

  • Ravi Kiran
  • Publish Date - 6:56 am, Sun, 31 March 19
కుక్క కోసం బెయిల్ అడిగిన నీరవ్ మోడీ..!

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీను కొద్ది రోజుల క్రిందట బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన మోడీకి బెయిల్ సంపాదించేందుకు ఆయన న్యాయవాదుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతడి తరపు న్యాయవాది వింతైన వాదన వినిపించారు. నీరవ్ మోడీకి కుక్క ఉందని, దాని బాగోగులు చూసుకోవడానికి మోడీకి బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్ధించారు. అయితే ఈ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు నీరవ్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను భయపెట్టే అవకాశముందని భారత్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనితో భారత్ తరపు న్యాయవాదుల వాదనకు ఏకీభవించి కోర్టు నీరవ్ మోడీకి బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించింది.