నేడే లండన్ కోర్టుకి నీరవ్ మోదీ!

నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను భారత్‌ నుంచి లండన్‌ వెళ్లారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్‌ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. సెంట్రల్ లండన్‌లోని ఓ బ్యాంకులో అకౌంట్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు నీరవ్‌ మోదీని అరెస్ట్ చేశారు. అప్పటినుంచి ఆయనను హెచ్ఎంపీ వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు. ఆ […]

నేడే లండన్ కోర్టుకి నీరవ్ మోదీ!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: May 30, 2019 | 9:39 AM

నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను భారత్‌ నుంచి లండన్‌ వెళ్లారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్‌ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది.

సెంట్రల్ లండన్‌లోని ఓ బ్యాంకులో అకౌంట్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు నీరవ్‌ మోదీని అరెస్ట్ చేశారు. అప్పటినుంచి ఆయనను హెచ్ఎంపీ వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు. ఆ తర్వాత మార్చి 20న జిల్లా జడ్జి మేరీ మాలన్.. నీరవ్ పెట్టుకున్న మొదటి బెయిట్ పిటిషన్‌ను తిరస్కరించారు. మార్చి 29న రెండోసారి జడ్డి అర్బత్నాట్.. నీరవ్‌కు బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించారు. “ఇదో అసాధారణ మోసానికి సంబంధించిన కేసు, సాక్షులను చంపుతామని బెదిరించినట్లు కూడా ఆరోపణలున్నాయి” అని జడ్జి వ్యాఖ్యానించారు. విడుదల చేస్తే తిరిగి లొంగిపోతారనే నమ్మకం కూడా లేదని ఆమె అన్నారు.

“వాండ్స్‌వర్త్ జైలులో పరిస్థితులు ఆయన ఉండటానికి అనుకూలంగా లేవు. మీరు ఎలాంటి షరతులు, నిబంధనలు విధించినా పాటించడానికి నీరవ్ సిద్ధంగా ఉన్నారు” అని నీరవ్ తరపు న్యాయవాది క్లారె మాంట్‌గోమెరీ కోర్టుకు తెలిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణ పూర్తయ్యే సమయానికి జడ్జి ఈ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో తన అనుమానాలను వ్యక్తం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.

నీరవ్ మోదీకి బెయిల్ మంజూరు చెయ్యవద్దంటూ భారత అధికారుల తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) వాదనలు వినిపించింది. ఆయనను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదముందని తెలిపారు.

చివరగా ఈ నెల 30న(గురువారం) నీరవ్ మోదీని లండన్ కోర్టులో ప్రవేశపెడుతున్నారు.