నీరవ్ మోడీ కేసులో విచారణ ఇవాళ్టి నుంచి షురూ..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలతో లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించే కేసుకు సంబంధించిన విచారణ మళ్లీ సోమవారం నుంచి మొదలుకానుంది.

నీరవ్ మోడీ కేసులో విచారణ ఇవాళ్టి నుంచి షురూ..
Follow us

|

Updated on: Sep 07, 2020 | 11:15 AM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలతో లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించే కేసుకు సంబంధించిన విచారణ మళ్లీ సోమవారం నుంచి మొదలుకానుంది. నిరుడు మార్చి నుంచి ఆయన వాయువ్య లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నారు. కాగా, ఆయనను వర్చువల్ విధానంలో కోర్టు విచారణ జరుపనుంది. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఆయన జైలు గది నుంచే విచారణకు సిద్ధం కావాలని జడ్జి శామ్యూల్‌ గూజే ఆదేశించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.11వేల కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్‌ మోదీ నిందితుడు.

కాగా, తన అన్న అక్రమాలకు, నేరపూరిత కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపిస్తూ నీరవ్ తమ్ముడు నిషాల్ మోదీ ఇప్పటికే ముందుకు వచ్చాడు. నీరవ్ మోదీ అవినీతి గురించి తనకు తెలియందటూ నిషాల్ ఈడీని ఆశ్రయించాడు. ఈ మేరకు తాను దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు ఒక లేఖ రాశాడు. నీరవ్ మోదీ సంపదకు తాను లబ్ధిదారుడిని కాదని నొక్కిచెప్పిన నీషల్ ఫైర్‌స్టార్ డైమండ్ డైరెక్టర్‌గా వేతనంతోపాటు వ్యాపారం ద్వారా వచ్చే చట్టబద్ధమైన ఆదాయాన్ని మాత్రమే తాను పొందానని, క్రమం తప్పకుడా పన్నులు కూడా చెల్లించానని రాశాడు. మరోవైపు ఈ లేఖ విషయాన్ని ధ్రువీకరించిన ఈడీ అధికారి ఒకరు నీషల్ నిందితుడు కాబట్టి, అతని సమాచారానికి విలువ వుండదని పేర్కొన్నారు.

ఇదిలావుంటే, దాదాపు రూ.14వేల కోట్ల పీఎన్‌బీ స్కాంలో ప్రధాన ఆరోపణలపై నీరవ్ మోదీని 2019 మార్చిలో లండన్‌లో అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో మరో ప్రధాన నిందితుడు అతని మామ మెహుల్ చోక్సీ, నీరవ్ సోదరుడిపై కూడా ఇప్పటికే పలు ఆరోపణలు కింద సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న నీరవ్‌ను వీడియో ద్వారా విచారించిన వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అతడి జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏప్రిల్ 28వ తేదీవరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా నీరవ్ ను భారత్‌కు అప్పగించే కేసుకు సంబంధించిన విచారణ విచారణ ఇవాళ్టి నుంచి మొదలు కానుంది.