AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిహారిక పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు, రాజస్థాన్‌లోని ఉదయ్ విలాస్ లో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్

మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్‌ రాష్ట్రంలో ల్యాండ్ అయింది. రేపు(డిసెంబర్ 9వ తేదీ) నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్‌లో..

నిహారిక పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు, రాజస్థాన్‌లోని ఉదయ్ విలాస్ లో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్
Venkata Narayana
|

Updated on: Dec 08, 2020 | 9:25 PM

Share

మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్‌ రాష్ట్రంలో ల్యాండ్ అయింది. రేపు(డిసెంబర్ 9వ తేదీ) నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్‌లో జరుగుతోన్న నేపథ్యంలో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన ఫ్యామిలీస్ అన్నీ వేడుకకోసం ఉదయ్ విలాస్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరు మెగా హీరోలు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు. మెగా కుటుంబం కాకుండా కేవలం 120 మందిని మాత్రమే పెళ్లి వేడుకకు ఆహ్వానించారు. నిన్నటి నుండే ప్రీవెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. మెగా కాంపౌండ్ హీరోలంతా ఆటలు పాటలతో ఉదయ్ విలాస్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వేడుకకు పవన్ కళ్యాణ్ వెళ్తారా లేదా అనే సందేహం ఇంతవరకూ కొనసాగుతూ వచ్చింది. పవన్ రైతుల కోసం దీక్షలు, పర్యటనలు లాంటి రాజకీయ కార్యక్రమాల హడావిడిలో ఉండటంతో ఆయన వివాహారానికి వెళ్లలేరని కొందరు, వెళ్తారని కొందరు అంటూ వచ్చారు. అయితే పవన్ పనులన్నింటినీ ముగించుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఉదయపూర్ బయలుదేరారు. ఉదయ్‌ విలాస్‌లో డిసెంబర్‌ 9న అనగా రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక, చైతన్యల వివాహం జరగనుంది.

Follow Us
సమ్మర్ సూపర్ ఫ్రూట్.. కానీ, షుగర్ ఉన్నవారు ఈ పండు తినొచ్చా?
సమ్మర్ సూపర్ ఫ్రూట్.. కానీ, షుగర్ ఉన్నవారు ఈ పండు తినొచ్చా?
వ్యాపారంలో సక్సెస్ కావడానికి చాణక్యుడి చెప్పిన 5 అద్భుత సూత్రాలు!
వ్యాపారంలో సక్సెస్ కావడానికి చాణక్యుడి చెప్పిన 5 అద్భుత సూత్రాలు!
శ్రీలీల అందుకే నావైపు తిరిగింది..
శ్రీలీల అందుకే నావైపు తిరిగింది..
ఫ్రిజ్ వాటర్ తాగేవారికి అలర్ట్.. ఈ వ్యాధులకు వెల్కం చెప్పినట్టే
ఫ్రిజ్ వాటర్ తాగేవారికి అలర్ట్.. ఈ వ్యాధులకు వెల్కం చెప్పినట్టే
బిజీ రోడ్డుపై కోడి గుడ్లు లారీకి యాక్సిడెంట్.. ఆ తర్వాత సీన్ ఇదే!
బిజీ రోడ్డుపై కోడి గుడ్లు లారీకి యాక్సిడెంట్.. ఆ తర్వాత సీన్ ఇదే!
మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా? ఈ 4 వస్తువులు దిండు కింద పెట్టుకుంటే
మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదా? ఈ 4 వస్తువులు దిండు కింద పెట్టుకుంటే
6 అడుగుల నాగుపామును పట్టి.. దానిని నీళ్లతో కడిగి...
6 అడుగుల నాగుపామును పట్టి.. దానిని నీళ్లతో కడిగి...
మీ కిచెన్లోనే సైలెంట్ కిల్లర్స్.. ఇవి మోసుకొచ్చే డేంజరస్ వ్యాధులు
మీ కిచెన్లోనే సైలెంట్ కిల్లర్స్.. ఇవి మోసుకొచ్చే డేంజరస్ వ్యాధులు
పాపం ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
పాపం ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
ఉదయం లేవగానే వీటిని చూశారో.. మీ అంత అదృష్టవంతులే ఉండరు!
ఉదయం లేవగానే వీటిని చూశారో.. మీ అంత అదృష్టవంతులే ఉండరు!