ఉన్నావ్ రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి.. ఢిల్లీలో ఉద్రిక్తతలు..!

యూపీలోని ఉన్నావ్ లో 23 ఏళ్ళ రేప్ బాధితురాలి మృతిపై ఢిల్లీలో యువత గళమెత్తింది. ఆమె మరణానికి కారకులైన మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థినులు, మహిళలు కదం తొక్కారు. మొదట కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వారు ఆ తరువాత ఇండియాగేట్ వద్దకు ప్రదర్శనగా రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిని ఛేదించుకుని రాబోయిన వారిపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. […]

ఉన్నావ్ రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి.. ఢిల్లీలో ఉద్రిక్తతలు..!
Anil kumar poka

|

Dec 08, 2019 | 4:19 PM

యూపీలోని ఉన్నావ్ లో 23 ఏళ్ళ రేప్ బాధితురాలి మృతిపై ఢిల్లీలో యువత గళమెత్తింది. ఆమె మరణానికి కారకులైన మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థినులు, మహిళలు కదం తొక్కారు. మొదట కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వారు ఆ తరువాత ఇండియాగేట్ వద్దకు ప్రదర్శనగా రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిని ఛేదించుకుని రాబోయిన వారిపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. కొన్ని చోట్ల నినాదాలు చేస్తూ దూసుకువస్తున్న నిరసనకారులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు ఉన్నావ్ లో బాధితురాలి అంత్యక్రియల సందర్భంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు.. పోలీసులను ఆ ఛాయలకు రాకుండా అడ్డుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. స్వయంగా వఛ్చి తమ కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవలే హైదరాబాద్ లో దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ పై దేశవ్యాప్త సంచలనం రేగిన నేపథ్యంలో.. ఇలాంటి మృగాళ్లను ఉరి తీయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఉన్నావ్ రేప్ బాధితురాలి కుటుంబం కూడా తమ కూతురికి జరిగిన అన్యాయానికి, ఆమె మృతికి కారకులైన కీచకులను ఎన్‌కౌంటర్ చేయాలని కోరుతోంది.

కాగా.. బాధితురాలి అంత్యక్రియలను పోలీసులు బలవంతంగా నిర్వహించారు. బాధితురాలి మరణానికి కారుకులైన నిందితులపై హత్యాభియోగాలు మోపుతామని, కఠిన శిక్షలు విధిస్తామని వారు ఇచ్చిన హామీతో.. ఆమె కుటుంబీకులు అంత్య క్రియలకు వారిని అనుమతించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఇంటిని మంజూరు చేస్తామని కూడా వాగ్ధానం చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu