ఇంటి రిపేర్లకు నిధులు వద్దన్న జగన్…
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ధనాన్ని అనేక విధాలుగా పొదుపు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రివర్స్ టెండరింగ్‌తో వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చిన ఆయన.. తాజాగా తాడేపల్లిలో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆరు జీవోలను రద్దు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ లోటస్ పాండ్ సెక్యూరిటీకి సంబంధించిన జీవోను కూడా జగన్ రద్దు చేశారు. ప్రమాణ స్వీకారం రోజు నుంచే తండ్రి వైఎస్ఆర్‌ను గుర్తు […]

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ధనాన్ని అనేక విధాలుగా పొదుపు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రివర్స్ టెండరింగ్‌తో వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చిన ఆయన.. తాజాగా తాడేపల్లిలో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆరు జీవోలను రద్దు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ లోటస్ పాండ్ సెక్యూరిటీకి సంబంధించిన జీవోను కూడా జగన్ రద్దు చేశారు.
ప్రమాణ స్వీకారం రోజు నుంచే తండ్రి వైఎస్ఆర్‌ను గుర్తు చేస్తూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్ నివాసానికి, క్యాంపు కార్యాలయానికి సంబంధించిన విద్యుత్, ఫర్నీచర్, ఇతరత్రా పనులకు కేటాయించిన రూ. 3కోట్ల నిధుల తాలూకు జీవోలను నిలిపేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గతంలో ప్రతిపక్షాలు అధికారిక నివాసానికి నిధులు కేటాయించడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.




