AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మరో వివాదం.. రేషన్ కార్డులపై మత ప్రచారం

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలన అంతటా మతపరమైన కోణంలో సాగుతోందని.. బలవంతంగా మత మార్పిడిలు, అన్య మత ప్రచారం సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదట ఆర్టీసీ టికెట్లపై.. ఆ తర్వాత టీటీడీలో అన్య మత ప్రచారం జరిగిందని కలకలం రేగింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఈ మత ప్రచారాంశం తెరపైకి వచ్చింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డుపై ఏసు క్రీస్తు బొమ్మలను ముద్రించడం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. […]

ఏపీలో మరో వివాదం.. రేషన్ కార్డులపై మత ప్రచారం
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 08, 2019 | 5:55 PM

Share

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలన అంతటా మతపరమైన కోణంలో సాగుతోందని.. బలవంతంగా మత మార్పిడిలు, అన్య మత ప్రచారం సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదట ఆర్టీసీ టికెట్లపై.. ఆ తర్వాత టీటీడీలో అన్య మత ప్రచారం జరిగిందని కలకలం రేగింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఈ మత ప్రచారాంశం తెరపైకి వచ్చింది.

ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డుపై ఏసు క్రీస్తు బొమ్మలను ముద్రించడం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులోని ఓ షాపు యజమాని.. ఇలా క్రీస్తు, వెంకటేశ్వర స్వామి బొమ్మలను కార్డులపై చిత్రీకరించారు.

జనం నిత్యం ఉపయోగించే అంత్యోదయ కార్డులపై ఇలా మత ప్రచారం జరుగుతుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పంచాయితీ ఆఫీసులు, గాంధీ విగ్రహం దిమ్మెకు, సాయి బాబా దిమ్మెకు వైకాపా రంగులు పూయడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. తిరుపతిలో అన్యమత ప్రచారం జరగట్లేదని ఖండించినప్పటికీ.. ఈ ఉదంతం ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తోంది.