జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలు.. అమెరికా ప్రతినిథుల సభలో ఎంపీల తీర్మానం

జమ్ము కశ్మీర్‌లో సామూహిక నిర్బంధాలు, కమ్యూనికేషన్లపై ఆంక్షలను ఖండిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ఇద్దరు ఎంపీలు ప్రమీలా జయపాల్(ఇండియన్ అమెరికన్ డెమొక్రాట్), స్టీవ్ వాట్ కిన్స్(రిపబ్లికన్ లా మేకర్) తీర్మానం చేశారు. 745 కింద వారిద్దరు ఈ తీర్మానాన్ని సంయుక్తంగా ప్రతిపాదించారు. కశ్మీర్లో ఇంకా పలుచోట్ల ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు కొనసాగుతున్నాయని, వాటిని ఎత్తివేయాలని వారిద్దరు తమ తీర్మానంలో పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రమీల మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్లో వెంటనే ఆంక్షలు ఎత్తేయాలి, నిర్బంధంలో ఉన్న వారిని […]

జమ్ముకశ్మీర్‌లో ఆంక్షలు.. అమెరికా ప్రతినిథుల సభలో ఎంపీల తీర్మానం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 08, 2019 | 8:45 PM

జమ్ము కశ్మీర్‌లో సామూహిక నిర్బంధాలు, కమ్యూనికేషన్లపై ఆంక్షలను ఖండిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ఇద్దరు ఎంపీలు ప్రమీలా జయపాల్(ఇండియన్ అమెరికన్ డెమొక్రాట్), స్టీవ్ వాట్ కిన్స్(రిపబ్లికన్ లా మేకర్) తీర్మానం చేశారు. 745 కింద వారిద్దరు ఈ తీర్మానాన్ని సంయుక్తంగా ప్రతిపాదించారు. కశ్మీర్లో ఇంకా పలుచోట్ల ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు కొనసాగుతున్నాయని, వాటిని ఎత్తివేయాలని వారిద్దరు తమ తీర్మానంలో పేర్కొన్నారు.

ఇదే విషయంపై ప్రమీల మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్లో వెంటనే ఆంక్షలు ఎత్తేయాలి, నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలి. రాజకీయ కార్యకలాపాలు, ప్రసంగాలు చేయకూడదని చెప్పకూడదు. కశ్మీర్‌కు అంతర్జాతీయ హక్కుల సంఘాలను, జర్నలిస్టులను స్వేచ్ఛగా అనుమతించాలి. మైనారిటీలపై సాగే అన్ని రకాల హింసను మేం ఖండిస్తున్నాం’’ అని పేర్కొంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం అక్కడ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా గుర్తిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా దీనిపై త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అయితే కశ్మీర్ అంశమన్నది భారత్‌లో అంతర్భాగమని, అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరని భారత్ స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.