AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ గారూ ! టాయ్ లెట్లూ ! నీటి కొరతపై ‘ గన్ షాట్లు ‘ !

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నలుగుతూ .. ‘తన వ్యాఖ్యలతో ‘ నవ్వులు పంచుతున్న ‘ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్ళీ అదే తరహాలో నిండు ‘ మయసభ ‘.. అదే వైట్ హౌస్ లో ‘ ‘ అతి పెద్ద ‘ సబ్జెక్ట్ ‘ పై ప్రసంగించారు. ఒకప్పుడు తమ దేశానికి పక్కలో బల్లెమైన నార్త్ కొరియా మీద వార్ చేస్తానని బీరాలు పలికిన ఆయన… ఈ సారి మరేదీ లేనట్టు టాయిలెట్ల మీద […]

ట్రంప్ గారూ ! టాయ్ లెట్లూ ! నీటి కొరతపై ' గన్ షాట్లు ' !
Anil kumar poka
|

Updated on: Dec 08, 2019 | 3:25 PM

Share

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నలుగుతూ .. ‘తన వ్యాఖ్యలతో ‘ నవ్వులు పంచుతున్న ‘ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్ళీ అదే తరహాలో నిండు ‘ మయసభ ‘.. అదే వైట్ హౌస్ లో ‘ ‘ అతి పెద్ద ‘ సబ్జెక్ట్ ‘ పై ప్రసంగించారు. ఒకప్పుడు తమ దేశానికి పక్కలో బల్లెమైన నార్త్ కొరియా మీద వార్ చేస్తానని బీరాలు పలికిన ఆయన… ఈ సారి మరేదీ లేనట్టు టాయిలెట్ల మీద పడ్డారు. ఏకంగా వాటిపై యుధ్ధమే ప్రకటించారు. బిజినెస్ లీడర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తమ దేశంలో నీటి కొరత ఉన్నప్పటికీ, ప్రజలు టాయ్ లెట్లను 10 నుంచి 15 సార్లు ఫ్లష్ చేస్తున్నారని అన్నారు. అంటే అవసరమైనదానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారని వాపోయారు. ఇలా జరగరాదని, నీటి ఆదాకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ‘ దర్యాప్తు ‘ జరపాలని పర్యావరణ పరిరక్షణ సంస్థకు సూచించారు. ‘ మనం సింక్స్ , షవర్స్ , బాత్ రూముల్లోని ఇతరాల పట్ల చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఇన్నిసార్లు టాయిలెట్లను ఎందుకు ఫ్లష్ చేస్తున్నారు ? ఈ నీరంతా వృధాగా సముద్రంలో కలుస్తోంది ‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎడారిలాంటి ప్రాంతాల్లో నీటిని ఆదా చేసే వ్యవస్థల అవసరం ఏర్పడవచ్ఛునని, అనేక దేశాల్లో ఎంతో నీరు ఉందని, దాన్నే వర్షం అంటున్నామని అన్నారు. ఆ నీటిని ఏం చేయాలో ఆ దేశాలవారికి తెలియడంలేదన్నారు. అసలు అమెరికన్లు తనను చూసి నీటిని ఎలా ఆదా చేయాలో నేర్చుకోవాలని కూడాట్రంప్ హితవు పలికారు. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు ఇలా టాయిలెట్లపై వ్యాఖ్యానాలు చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు  జోకులమీద జోకులు వేయడమే గమనార్హం. . .