India Corona Cases: భారత్‌లో కాస్త తగ్గుతున్న కరోనా కేసులు.. మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి..
India Corona Cases: దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్, కర్ఫ్యూలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా దేశంలో నమోదవుతోన్న కొత్త కేసులు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో...
India Corona Cases: దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్, కర్ఫ్యూలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా దేశంలో నమోదవుతోన్న కొత్త కేసులు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,76,070 కేసులు నమోదయ్యాయి. ఇక 3,69,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే మరణాలు మాత్రం భయాందోళను కలిగిస్తూనే ఉన్నాయి. ఓవైపు కరోనా కేసులు తగ్గుతున్నా మరణాలు పెరుగుతుండడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 3,874 మంది కరోనా కారణంగా మరణించారు.
మొత్తం కరోనా కేసులు..
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికు మొత్తం 2,57,72,400 కరోనా కేసులు నమోదుకాగా.. 2,23,55,440 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,87,122 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 31,29,878 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనాను అడ్డుకునే ఏకైక మార్గంగా భావిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 18,70,09,792 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
ఆందోళన కలిగిస్తోన్న బ్లాక్ ఫంగస్..
ఇక కరోనా పరిస్థితులు ఇలా ఉంటే కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తోన్న కొత్త వ్యాధి మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ఆందోళన కలిగిస్తోంది. పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని కూడా చేర్చినట్లు వెల్లడించారు.
Also Read: Sania Mirza: సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి… ఇంగ్లాండ్ సర్కారుకు క్రీడా శాఖ విజ్ఞప్తి