King Koti Hospital: కింగ్ కోటి ఆస్పత్రి నుంచి భారీగా కరోనా రోగులు జంప్…! అలా కాదంటోన్న సూపరింటెండెంట్
Corona Patients in King Koti Hospital : హైదరాబాద్ కింగ్ కోటి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన కరోనా రోగులు జంపై పోతున్నారు.
Corona Patients in King Koti Hospital : హైదరాబాద్ కింగ్ కోటి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన కరోనా రోగులు జంపై పోతున్నారు. ఇప్పటి వరకూ 90 మందికి పైగా ట్రీట్మెంట్ కోసం వచ్చిన కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పూర్తికాకుండానే కనిపించకుండా పోయినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాల వద్ద సరైన సమాచారం లేకుండా పోవడం విశేషం. రోగులు కనీసం డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు. టీ, కాఫీ కోసం కరోనా రోగులు బయటకు వెళ్లి వస్తున్నారని అప్పట్లో టీవీ9 వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా రోగుల మాయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ స్పందించారు. వాళ్లంతా చెప్పకుండా వెళ్లినట్టు కాదని ఆయన అన్నారు. వారిలో కొంతమంది మాకు ఇక్కడ ట్రీట్‌మెంట్ ఇష్టం లేదని చెప్పి వెళుతున్నారని, ఇంకొందరు చెప్పా పెట్టకుండా వెళ్తున్నారని ఆయన తెలిపారు. అయితే, అలా వెళ్లిన సంగతి తెలిసిన వెంటనే పోలీసులకు చెబుతున్నామని, రోగులు చెప్పకుండా వెళ్లడానికి వీల్లేకుండా సెక్యూరిటీని పెంచే దిశగా ఆలోచిస్తున్నామని డాక్టర్ రాజేంద్రనాథ్ చెప్పారు.
ఇలా ఉండగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కింగ్‌కోఠి ఆసుపత్రిలో కోవిడ్ టెస్టుల కోసం వచ్చిన వారి సంఖ్య 14,664 కాగా, వీరిలో 1,802 మంది ఆస్పత్రిలో అడ్మిట్ కాగా 782 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 261 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు.