ఒడిశాలో లక్ష దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ అంతకంతకు పెరుగుతుంది. నిత్యం వేలాది మంది కొవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. అటు, ఒడిషాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటేసింది.

ఒడిశాలో లక్ష దాటిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Aug 31, 2020 | 5:35 PM

దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ అంతకంతకు పెరుగుతుంది. నిత్యం వేలాది మంది కొవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. అటు, ఒడిషాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటేసింది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 2,602 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,536కు చేరుకుంది. కరోనా వైరస్‌తో ఇవాళ కొత్తగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య మొత్తం 492కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 29,758 యాక్టివ్‌ కేసులు ఉండగా, 73,233 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా నమోదైన కేసుల్లో 1,561 క్వారంటైన్‌ కేంద్రాల నుంచి, 1,041 లోకల్‌ కాంటాక్టులని తెలిపింది. ఆదివారం ఒకే రోజు 57,877 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటి వరకు 17,89,433 టెస్టులు చేసినట్లు వివరించింది. అత్యధికంగా రాష్ట్రంలో కొత్తగా కుర్దాలో అత్యధికంగా 616 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, కటక్‌లో 236, గంజాంలో 190, కేంద్రపాదలో 128, కొరపట్‌లో 127, జాజ్‌పూర్‌లో 103, బాలాసోర్‌లో 103 కేసులు రికార్డయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Latest Articles
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..