నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83లక్షల ఖాళీలు..!

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలు, వాటి అటాచ్డ్ / సబార్డినేట్ కార్యాలయాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పదవీ విరమణ, రాజీనామాలు, మరణాలు, పదోన్నతి మొదలైన వాటి వల్ల కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం లోక్‌సభకు వెల్లడించింది. ప్రస్తుత 2019-20 సంవత్సరంలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి), స్టాఫ్ […]

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83లక్షల ఖాళీలు..!

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలు, వాటి అటాచ్డ్ / సబార్డినేట్ కార్యాలయాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పదవీ విరమణ, రాజీనామాలు, మరణాలు, పదోన్నతి మొదలైన వాటి వల్ల కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం లోక్‌సభకు వెల్లడించింది.

ప్రస్తుత 2019-20 సంవత్సరంలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) మరియు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బి) అనే నియామక ఏజెన్సీలు కలిపి సుమారు 1.34 లక్షల పోస్టులకు నియామకాలకు సిఫార్సులు చేశాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 38,02,779 పోస్టులు ఉండగా.. 2018 మార్చి 1 నాటికి 31,18,956 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

అత్యధికంగా 1,16,391 సిఫార్సులు ఆర్‌ఆర్‌బి, 13,995 ఎస్‌ఎస్‌సి, యుపిఎస్‌సి 4,399 సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా 6,83,823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మంత్రిత్వ శాఖ అవసరాన్ని బట్టి నియామకాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Published On - 5:02 am, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu