అమిత్‌ షా.. బీఅలర్ట్.. ఝార్ఖండ్‌లో నక్సల్స్ ఏం చేశారంటే..?

ఝార్ఖండ్‌లో నక్సల్స్ రెచ్చిపోయారు. సారైకేల్ జిల్లా కుంతీ లోక్‌సభ పరిధిలో గల కర్సవాన్‌లోని బీజేపీ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చేశారు. గత అర్ధరాత్రి 12.30గంటల సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన నక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు ఝార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కుంతి, కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:38 am, Fri, 3 May 19
అమిత్‌ షా.. బీఅలర్ట్.. ఝార్ఖండ్‌లో నక్సల్స్ ఏం చేశారంటే..?

ఝార్ఖండ్‌లో నక్సల్స్ రెచ్చిపోయారు. సారైకేల్ జిల్లా కుంతీ లోక్‌సభ పరిధిలో గల కర్సవాన్‌లోని బీజేపీ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చేశారు. గత అర్ధరాత్రి 12.30గంటల సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన నక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు ఝార్ఖండ్‌లో పర్యటించనున్నారు. కుంతి, కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. ఇలాంటి నేపథ్యంలో నక్సల్ ఈ ఘాతుకానికి పాల్పడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా 6వ తేదిన ఝార్ఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.