79ఏళ్లుగా విద్యుత్‌ అవసరం లేకుండానే జీవిస్తున్న రిటైర్డ్‌ ప్రొఫెసర్‌

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రోజు కాదు కదా ఒక గంట కూడా కరెంట్‌ లేకుండా ఉండలేం. అలాంటిది పుణెకు చెందిన డాక్టర్‌ హేమా సనే అనే రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ 79ఏళ్లుగా విద్యుత్‌ అవసరం లేకుండా జీవిస్తున్నారు. ప్రకృతిపై ప్రేమ ఉంటే ఏ విద్యుత్‌ అవసరం లేదు అంటున్న హేమా సనే గురించి ఆమె మాటల్లోనే… ‘నేను పుణెలోని బుధ్వార్‌ పెత్‌లో ఉంటాను. నా వయసు 79ఏళ్లు. సావిత్రిబాయి పూలే పుణె యూనివర్శిటీ నుంచి బోటనీలో పీహెచ్‌డీ పూర్తిచేశాను. […]

79ఏళ్లుగా విద్యుత్‌ అవసరం లేకుండానే జీవిస్తున్న రిటైర్డ్‌ ప్రొఫెసర్‌
Follow us

| Edited By:

Updated on: May 08, 2019 | 5:22 PM

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రోజు కాదు కదా ఒక గంట కూడా కరెంట్‌ లేకుండా ఉండలేం. అలాంటిది పుణెకు చెందిన డాక్టర్‌ హేమా సనే అనే రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ 79ఏళ్లుగా విద్యుత్‌ అవసరం లేకుండా జీవిస్తున్నారు. ప్రకృతిపై ప్రేమ ఉంటే ఏ విద్యుత్‌ అవసరం లేదు అంటున్న హేమా సనే గురించి ఆమె మాటల్లోనే…

‘నేను పుణెలోని బుధ్వార్‌ పెత్‌లో ఉంటాను. నా వయసు 79ఏళ్లు. సావిత్రిబాయి పూలే పుణె యూనివర్శిటీ నుంచి బోటనీలో పీహెచ్‌డీ పూర్తిచేశాను. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు గర్వారే కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేశాను. ఒక మనిషికి ఆహారం, దుస్తులు, నివాసం అనేవి కనీస అవసరాలు. ఒకప్పుడు మనకు విద్యుత్‌ సదుపాయం లేదు. చాలా కాలం తర్వాత అది అందుబాటులోకి వచ్చింది. అప్పుడు కరెంట్‌ లేకుండానే బతికాం కదా.. అందుకే ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటున్నాను. ఈ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య హాయిగా జీవిస్తున్నాను. నాకు కరెంట్‌ అవసరం ఎప్పుడూ రాలేదు. రాత్రిపూట చిమ్నీలు పెట్టుకుని పీహెచ్‌డీ దాకా చదివాను. విద్యుత్‌ లేకుండా ఎలా ఉంటున్నారని చాలా మంది నన్ను అడుగుతారు. కరెంట్‌తో ఎలా జీవిస్తున్నారు అని నేను తిరిగి వారిని ప్రశ్నిస్తాను. నేడు జీవితం అంటే మెకానికల్‌ అయిపోయింది. టీవీలు, ఫోన్లు లేకపోతే పిల్లలు కనీసం ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. కానీ నా జీవితం అలా కాదు. ఈ పక్షులే నా స్నేహితులు. చాలా మంది నన్ను పిచ్చిదాన్ని అని అంటారు. నేను వెర్రిదాన్నే కావచ్చు. కానీ నా జీవితం నాకు నచ్చినట్లుగా ఉండాలని కోరుకుంటా. నేను చాలా మందిని కలిశాను. వారి జీవనవిధానం పూర్తిగా భిన్నం. నాకు మాత్రం ఈ పూరింట్లో ఉండటమే ఇష్టం’ అని హేమ చెబుతున్నారు. రాత్రిపూట వెలుతురు కోసం లాంతరు లాంటివి ఉపయోగిస్తారు.