Gopireddy Srinivasareddy: హోటల్ లో దోసెలు వేసిన నర్సరావు పేట ఎమ్మెల్యే.. ఎందుకంటే..
ఇప్పుడిప్పుడే ఎలాంటి ఎన్నికలు లేవు... ఎన్నికల ప్రచారాలు లేవు... మరి ఎమ్మెల్యే దోసె ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా? నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 'గుడ్ మార్నింగ్' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే ఎలాంటి ఎన్నికలు లేవు… ఎన్నికల ప్రచారాలు లేవు… మరి ఎమ్మెల్యే దోసె ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా? నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ‘గుడ్ మార్నింగ్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వార్డుల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయా లేదా అని ఆరాతీస్తున్నారు. అందని వాళ్లు తిరిగి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా 31 వార్డులో ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేస్తున్నారు. రోడ్డు పక్కనే హోటల్ కనిపించింది. హోటల్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేకి దోసెలు పోస్తున్న మహిళ కనిపించింది. ఆమె చేతిలోని గరిటె తీసుకొని దోసెలు పోశారు. ఎమ్మెల్యే పోసిన దోసెలను ఆరగించిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు దోసెలు బాగున్నాయంటూ ఎమ్మెల్యేకు కితాబిచ్చారు.
మరోవైపు ఎమ్మెల్యే ఇలా దోసెలు వేయడం ఎన్నికల స్టంటేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కోర్టు కేసులుండడంతో ఇప్పటి వరకూ నర్సరావుపేట మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారో కూడా లేదు. కానీ ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఎమ్మెల్యే ఇలా వార్డుల పర్యటన చేస్తున్నారని ప్రతిపక్షనాయకులు చెబుతున్నారు.
Also Read:
Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారి దోపిడి దొంగల బీభత్సం.. ఆ గ్రామాల్లో బెంబేలెత్తుతున్న ప్రజలు..
Strange Sounds: చిత్తూరు జిల్లాలో హడలెత్తిస్తున్న వింత శబ్దాలు.. వరుస ప్రకంపనలతో జనం పరుగులు..