Who is Bipin Rawat: ఊటీ వద్ద కూలిన ఆర్మీ హెలికాప్టర్.. అందులో ప్రయాణిస్తున్న బిపిన్ రావత్ ఎవరో తెలుసా..!

జనరల్ బిపిన్ రావత్‌‌‌ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ వ్యవహరిస్తున్నారు. జనరల్ రావత్ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌‌‌ డిసెంబర్..

Who is Bipin Rawat: ఊటీ వద్ద కూలిన ఆర్మీ హెలికాప్టర్.. అందులో ప్రయాణిస్తున్న బిపిన్ రావత్ ఎవరో తెలుసా..!
Bipin Rawat
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 08, 2021 | 5:26 PM

Chief of Defence Staff General Bipin Rawat: తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. . హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు చెబుతున్నారు. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌ భార్య కూడా ఉన్నారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను ఆర్పేశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. బిపిన్‌ రావత్‌ను భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా కేంద్రం నియమించింది. ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌ అయిన తరవాత ఆయన ఈ పదవిని చేపట్టారు. త్రివిధ దళాలకు అధిపతిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంపై ఆర్మీ దర్యాప్తును ప్రారంభించింది.

బిపిన్ రావత్‌‌‌ ఎవరంటే..

జనరల్ బిపిన్ రావత్‌‌‌ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ వ్యవహరిస్తున్నారు. జనరల్ రావత్ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌‌‌ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్రం ప్రకటించింది. ఈ పదవి ఏర్పాటుకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంగీకారంతో కేంద్రం ఈ నిర్ణయించింది. రక్షణ శాఖ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మిలటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పర్యవేక్షిస్తారు.

రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 1978 డిసెంబర్‌లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి గత ఏడాది డిసెంబర్ 31  వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్‌, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నారు బిపిన్ రావత్‌

CDS పదవి తెరపైకి ఇలా..

1999లో కార్గిల్‌ యుద్ధం తర్వాత దేశ రక్షణ విధానాల్లో లోపాలను పరిశీలించేందుకు ఏర్పడ్డ అత్యున్నత స్థాయి కమిటీ సూచన మేరకు CDS పదవి తెరపైకి వచ్చింది. CDS పదవిని సృష్టించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా CDS వ్యవహరిస్తున్నారు. ఆయనకు సైనిక పరమైన అధికారాలు ఉండవు. విడివిడిగా సైన్యం, నౌకాదళం, వాయుసేనలకు ఆయా దళాల అధిపతులే నాయకత్వం వహిస్తారు. కొత్తగా ఏర్పడ్డ సైబర్‌, అంతరిక్ష విభాగాలు CDS కనుసన్నల్లోనే పనిచేస్తుంది. NCA కు ఆయన సైనిక సలహాదారుగా ఉన్నారు. రక్షణ కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

2016 డిసెంబర్‌ 31న సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన రావత్‌.. మూడేళ్ల పాటు ఆ పదవిలో పనిచేశారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం సైన్యాధిపతి ఆ పదవిలో మూడేళ్లు కానీ 62 ఏళ్లు వచ్చే వరకూ కానీ ఉండొచ్చు. రావత్‌కు ఇంకా 62 ఏళ్లు నిండనప్పటికీ సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవ్వడంతో పదవీ విరమణ చేశారు.

సైన్యాధిపతి హోదాలో రావత్‌ అనేక సంస్కరణలు

సైన్యాధిపతి హోదాలో రావత్‌ అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాన్ని తెచ్చారు. సిమ్లాలోని సెయింట్‌ ఎడ్వర్డ్‌ పాఠశాలలో చదివిన రావత్‌ ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ద్వారా సైన్యంలోకి ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత 1978 డిసెంబర్‌లో గూర్ఖా రైఫిల్స్‌ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు. అనేక ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి: చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..

Beauty Tips: చలికాలంలో జుట్టు, చర్మం పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో