Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారి దోపిడి దొంగల బీభత్సం.. ఆ గ్రామాల్లో బెంబేలెత్తుతున్న ప్రజలు..
Robbers attacking people: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారిదోపిడి దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా.. యడ్లపాడు మండలం బోయపాలెం, లింగారావు పాలెం మధ్య దొంగలు
Robbers attacking people: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారిదోపిడి దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా.. యడ్లపాడు మండలం బోయపాలెం, లింగారావు పాలెం మధ్య దొంగలు రెండు జంటలపై దాడి చేయడం కలకలం రేపింది. గుంటూరు జిజిహెచ్‌లో ఉన్న రోగిని పరామర్శించి బైక్‌పై లింగారావు పాలెం వెళుతున్న వీరయ్య, ప్రసన్న దంపతులను ఎర్రచెరువు సమీపంలో ఎనిమిది మంది యువకులు అటకాయించి కర్రలతో దాడి చేశారు. వారి వద్ద నుంచి బంగారు జూకాలు, సెల్‌ఫోన్, 2,300 నగదు లాక్కున్నారు. అదే సమయంలో అదే మార్గంలో వస్తున్న అంకమ్మ, నర్సయ్య దంపతులపై కూడా దాడి చేసి వారి వద్దనున్న సెల్ ఫోన్, బంగారు ఆభరణాలు లాక్కున్నారు.
అయితే.. ఈ విషయం గ్రామంలో తెలియటంతో స్థానికులు దొంగలను పట్టుకునేందుకు సంఘటనా స్థలం వద్దకు తరలి వచ్చారు. అయితే అప్పటికే దొంగలు పరారయ్యారు. రాత్రి 9:30 గంటల సమయంలోనే దాడులు జరగటంతో స్థానికులు భయాభ్రాంతులకు గురయ్యారు. వివిధ పనుల నిమిత్తం చిలకలూరిపేట పట్టణం వెళ్లిన గ్రామస్థులు రాత్రి పూట వాహనాలపై ఇంటికి తిరిగి వస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని దాడులు చేయడంతో ఆ మార్గంలో ప్రయాణించటానికే ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాగా.. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.
ఇప్పటికే.. కృష్ణా, గుంటూరు జిల్లాలో చెడ్డిగ్యాంగ్ హల్‌చల్ చేస్తున్న సంఘటనలు తెరపైకి వచ్చాయి. దీంతో పోలీసులు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వారం నుంచి చెడ్డి గ్యాంగ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.
Also Read: