Watch Video: గోదాంలో షార్ట్ సర్క్యూట్.. అగ్నికి ఆహుతైన 40 బీఎండబ్ల్యూ కార్లు.. వీడియో
BMW cars charred: ఆర్ధిక రాజధాని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తుర్భే ఎంఐడీసీలో జరిగిన ఈ ప్రమాదంలో 40 బీఎండబ్ల్యూ (BMW) కార్లు అగ్నికి
BMW cars charred: ఆర్ధిక రాజధాని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తుర్భే ఎంఐడీసీలో జరిగిన ఈ ప్రమాదంలో 40 బీఎండబ్ల్యూ (BMW) కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో మంటలు చెలరేగడంతో దాదాపు 40కి కార్లు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆరు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. రూ. కోట్లు నష్టం వాటిల్లిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదంలో బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో ఉన్న 40 నుంచి 45 వాహనాలు మంటల్లో దహనమయ్యాయని అధికారులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు చాలాసేపు శ్రమించారు. 10 ఫైర్ టెండర్లతో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే.. ప్రమాదంలో ఎంత మేరకు నష్టం జరిగిందో ఇప్పటివరకు కంపెనీ ప్రతినిధులు వెల్లడించలేదు. అయితే.. ఈ ప్రమాంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎంఐడిసి ఫైర్ సర్వీసెస్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆర్‌బి పాటిల్ తెలిపారు. అక్కడ పార్క్ చేసిన కొన్ని వాహనాలు దహనమయ్యాయన్నారు.
#BMWcar fire video https://t.co/mH0c4Sl5HQ pic.twitter.com/0I6qfQnIMq
— Indrajeet chaubey (@indrajeet8080) December 8, 2021
Also Read: