AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం సంచలనం.. నూతన విద్యా విధానానికి ఆమోదం

విద్యా విధానంలో సంచలన మార్పులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జాతీయ విద్యా విధానం 2020కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

కేంద్రం సంచలనం.. నూతన విద్యా విధానానికి ఆమోదం
Ravi Kiran
|

Updated on: Jul 29, 2020 | 7:04 PM

Share

National Education Policy 2020: విద్యా విధానంలో సంచలన మార్పులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా జాతీయ విద్యా విధానం 2020కి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలను చేసింది. 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది.

విద్యా విధానంలో మార్పులు ఇలా ఉన్నాయి…

  •  మూడు నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి
  • 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యం
  • ఆరు తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్
  •  6వ తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు
  • M.Phil కోర్సును పూర్తిగా తొలిగింపు
  • ప్రస్తుతం 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానం.. ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం
  • డిగ్రీ విద్య మూడు నుంచి నాలుగేళ్లు
  • పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు
  • ఇంటర్ విద్య ఉండదు
  • ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు
  • దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే కరిక్యులమ్
  • పాఠ్యాంశాల భారం తగ్గించే కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం
  • ఇక నుంచి కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ కేవలం 12వ తరగతి వరకు మాత్రమే
  • రీసెర్చ్ ఇంటెన్సివ్ లేదా టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలకు ఆమోదం

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు