తెలంగాణలో జోరు వానలు.. ఎక్కడ.. ఎంత కురిసిందంటే..

జోరు వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ విదర్భ వరకు దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్ద అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో..

  • Sanjay Kasula
  • Publish Date - 6:52 pm, Wed, 29 July 20
తెలంగాణలో జోరు వానలు.. ఎక్కడ.. ఎంత కురిసిందంటే..

జోరు వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ విదర్భ వరకు దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్ద అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కురిసిన వర్షాపాత వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

ఇక శేరిలింగంపల్లిలో 7 సెంటీమీటర్లు.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కామారెడ్డి ,సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి ఇలా చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్మెట్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, ఆసిఫ్ నగర్ , ప్రాంతాల్లో ఇలా చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.