Akkineni Hero As Mahesh Fan: మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా అక్కినేని నాగచైతన్య..
Naga Chaitanya As Mahesh Fan: ఇటీవల మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. హీరోలు కూడా తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి...
Naga Chaitanya As Mahesh Fan: ఇటీవల మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. హీరోలు కూడా తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి ఇతర హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మల్టీస్టారర్ సినిమాలే కాకుండా ఇతర హీరోల చిత్రాల్లో అతిథి పాత్రలో నటించడానికి కూడా ఓకే చెప్తున్నారు. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్నాడనేది సదరు వార్త సారంశం. వివరల్లోకి వెళితే.. అక్కినేని నటవారసుడు నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగచైతన్య మహేష్ బాబు అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కనిపించనున్నాడనే వార్త వైరల్‌గా మారింది. అంతేకాకుండా మహేష్ ఈ చిత్రంలో నాగచైతన్యతో స్క్రీన్‌ను కూడా షేర్ చేసుకోనున్నాడని సమాచారం. మరి అక్కినేని వారసుడి సినిమాలో మహేష్ బాబు నటించనున్నాడా? లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.