Rashmika ChitChat: ఆ విషయం గురించి నేను చెప్పనుగా.. వారు అనుమతిస్తేనే బయటపెడతానంటున్న రష్మిక..

Rashmika ChitChat With Fans: సినిమాలతో నిత్యం ఉండే నటి రష్మిక మందన సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు...

Rashmika ChitChat: ఆ విషయం గురించి నేను చెప్పనుగా.. వారు అనుమతిస్తేనే బయటపెడతానంటున్న రష్మిక..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 06, 2021 | 12:14 PM

Rashmika ChitChat With Fans: సినిమాలతో నిత్యం ఉండే నటి రష్మిక మందన సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిందీ బ్యూటీ. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

‘నా గురించి ఇప్పటి వరకు మీకు తెలయని విషయాలను అడగండి’ అనే క్యాప్షన్‌ జోడిస్తూ పోస్ట్‌ చేసిన రష్మికకు ఓ అభిమాని మీ తర్వాతి సినిమాల విశేషాలను చెప్పండి అని అడిగారు. సదరు ప్రశ్నకు స్పందించిన రష్మిక రిప్లై ఇస్తూ.. ‘ నా తర్వాతి ప్రాజెక్టుల గురించి మీరు ఏ విషయాలు తెలుసుకోలేరు. వారు అనుమతి ఇస్తే తప్ప ఆ చిత్రాల గురించి నేను మాట్లాడలేను (నిర్మాతలను ఉద్దేశిస్తూ)’ అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ఫ’తో పాటు శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో నటిస్తోంది. మరి రష్మిక తర్వాతి ప్రాజెక్టుల గురించి చెప్పడానికి అంతలా ఎందుకు నిరాకరించిందో తెలియాల్సి ఉంది.

Also Read: Red Movie New Song: యూత్‌ని ఆకట్టుకుంటోన్న ‘నువ్వే.. నువ్వే’ వీడియో సాంగ్‌… బాగా వర్కవుట్‌ అయిన కెమిస్ట్రీ..