ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ : డైలమాలో నాగార్జున, అభిమానులు ఒప్పుకుంటారా?

మన్మథుడు2 తర్వాత.. గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి సైలెంట్‌గా  ది వైల్డ్‌ డాగ్ మూవీ ప్రారంభించారు నాగార్జున. తనకు కలిసిరాదని తెలిసినా.. డేర్ చేసిమరీ నాగ్ తీసుకున్న రిస్కీ డెసిషన్ ఇది.

ఓటీటీలో 'వైల్డ్ డాగ్' : డైలమాలో నాగార్జున, అభిమానులు ఒప్పుకుంటారా?
Follow us

|

Updated on: Nov 27, 2020 | 10:20 AM

‘మన్మథుడు2’ తర్వాత.. గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి సైలెంట్‌గా ‘వైల్డ్‌ డాగ్’ మూవీ ప్రారంభించారు నాగార్జున. తనకు కలిసిరాదని తెలిసినా.. డేర్ చేసిమరీ నాగ్ తీసుకున్న రిస్కీ డెసిషన్ ఇది. కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్న ఈ మూవీలో ఎన్.ఐ.ఏ ఆఫీసర్‌గా నాగార్జున కనిపించనున్నారు. ఇప్పుడా మూవీ ఫినిషై విడుదలకు సిద్దంగా ఉంది. ఐతే.. తన ‘వైల్డ్‌ డాగ్’ మూవీని ఏ డయాస్‌ మీద ఆడియన్స్‌కి పరిచయం చేయాలన్న డైలమాలో వున్నారు నాగ్.

పవర్‌ఫుల్ కాప్‌గా ‘శివమణి’ సినిమాలో సూపర్‌గా పెర్ఫామ్ చేసి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న నాగార్జున.. ఆ తర్వాత ఆ జానర్‌ని పూర్తిగా మానేశారు. రీసెంట్‌గా రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లో ఆఫీసర్‌గా కనిపించినా..ఫలితం నిరాశపరిచింది. ఇప్పుడు మళ్లీ పోలీస్ రోల్‌లో మన్మథుణ్ణి రిసీవ్ చేసుకోడానికి ఆడియన్స్‌ రెడీగా వున్నారా..అనే ఆసక్తికరంగా మారింది. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో ఇప్పటికే ఓ మూవీ ఒప్పుకున్నారు కింగ్ నాగార్జున. ఆ సెట్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేలోగా వైల్డ్‌డాగ్‌ మూవీ రిలీజ్ విషయాన్ని తేల్చాలని భావిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కే మేకర్స్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నా.. అక్కినేని కాంపౌండ్‌ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతవరకూ నానీ ‘వీ’ తప్పితే మరో తెలుగు స్టార్ హీరో మూవీ ఏదీ ఓటీటీ ద్వారా ప్రేక్షకులు ముందుకు రాలేదు.

ఒకవైపు థియేటర్ల ఓపెనింగ్ కోసం ప్రభుత్వాలతో మాట్లాడుతూ.. మరోవైపు తన సినిమాల్నే ఓటీటీలో రిలీజ్ చేస్తే.. ఎటువంటి రియాక్షన్ వస్తుందన్న విషయంలో నాగ్ డైలమాలో పడ్డారు. నాగార్జునకున్న మార్కెట్ రేంజ్‌కి తగ్గట్లు ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్‌ కూడా కంప్లీట్ చేసుకున్న ‘వైల్డ్‌ డాగ్’‌ మూవీ రిలీజ్‌పై ఇండస్ట్రీలో సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం

ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు

కేంద్రం కీలక నిర్ణయం, స్థానిక భాషల్లో ఇంజనీరింగ్‌ కోర్సులు, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే