అంబానీ ఇంట్లో సీఆర్‌పీఎఫ్ కమాండో మృతి.. కారణమేంటంటే.?
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో సీఆర్‌పీఎఫ్ కమాండో అనుమానాస్పద మృతి సంచలనమైంది. దక్షిణ ముంబైలోని విలాసవంతమైన ‘ఆంటాలియా’కు సెక్యూరిటీగా పని చేస్తున్న బొతారా డి రాంభాయ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. బుధవారం రాత్రి తన తుపాకీతో ఆయన కాల్చుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాంభాయ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు గన్ పేలి చనిపోయాడా అన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు […]

భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో సీఆర్‌పీఎఫ్ కమాండో అనుమానాస్పద మృతి సంచలనమైంది. దక్షిణ ముంబైలోని విలాసవంతమైన ‘ఆంటాలియా’కు సెక్యూరిటీగా పని చేస్తున్న బొతారా డి రాంభాయ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. బుధవారం రాత్రి తన తుపాకీతో ఆయన కాల్చుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాంభాయ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు గన్ పేలి చనిపోయాడా అన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు గుజరాత్‌కు చెందిన వాసి అని గుర్తించారు. 2014లో అతడు సీఆర్‌పీఎఫ్‌లో చేరినట్లు సమాచారం. కాగా, వీఐపి కోటాలో ముకేశ్ అంబానీకి ‘జెడ్ +’ కేటగిరీ, ఆయన భార్య నీతా అంబానీకి ‘వై’ కేటగిరి సెక్యూరిటీని కలిపిస్తున్న సంగతి తెలిసిందే.