కరోనా లాక్ డౌన్: మాస్క్ ధరించని మున్సిపల్ సిబ్బంది.. రూ.1000 ఫైన్..
కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. తెలంగాణలో మాస్క్ ధరించడం తప్పనిసరి. కనీసం కర్చీఫ్ అయినా కట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఇప్పటికీ చాలా

కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. తెలంగాణలో మాస్క్ ధరించడం తప్పనిసరి. కనీసం కర్చీఫ్ అయినా కట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఇప్పటికీ చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ వేసుకోవడం లేదు. సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కరోనా కట్టడికోసం మాస్క్ ధరించడం తప్పనిసరి. కాగా.. మంచిర్యాలో ఇద్దరు మునిసిపల్ సిబ్బంది మాస్క్ ధరించకపోవడంతో.. మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం వేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు వారిద్దరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నా.. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 970కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 252 మంది కోలుకున్నారు. మొత్తంగా 25 మంది మరణించారు. రాష్ట్రంలో 693 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: కరోనా ఎఫెక్ట్: మొబైల్ ఫోన్ల ద్వారా వైరస్ వ్యాప్తి..?



