Google Trends 2020- ఈ సంవత్సరం అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన పదాలు ఏమిటో తెలుసా..?
మరో రెండు రోజుల్లో 2020 ఏడాది ముగింపు పలకనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది అందరికి చేదు జ్ఞాపకంగానే మిగిల్చింది. ప్రతి ఒక్కరి మదిలిలో ఈ ఏడాది...
మరో రెండు రోజుల్లో 2020 ఏడాది ముగింపు పలకనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది అందరికి చేదు జ్ఞాపకంగానే మిగిల్చింది. ప్రతి ఒక్కరి మదిలిలో ఈ ఏడాది గుర్తుండిపోయేలా చేసింది. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ భారతీయ నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలు, వ్యక్తుల జాబితాను గూగుల్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ జాబితాలో కరోనా వైరస్, ఐపీఎల్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బీహార్ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొదలైనవి టాప్ ట్రెండింగ్ గా నిలిచాయి.
ఈ ఏడాది ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ను సైతం వెనక్కి నెట్టి ఎక్కువ మంది భారతీయులు గూగుల్లో సెర్చ్ చేసిన పదంగా IPL2020. కాగా, అత్యధికంగా సెర్చ్ చేసిన నెటిజన్ల జాబితాలో నిలిచిన ఐపీఎల్ తర్వాత స్థానంలో కరోనా వైరస్ ఉంది. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్ ఆరంభమయ్యే వరకు కరోనా వైరస్ గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఎప్పుడైతే ఐపీఎల్ ప్రారంభమైందో అప్పటి నుంచి కరోనా వైరస్ గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గిపోయింది.
Also Read: Disaster movies of 2020: ఈ ఏడాది అత్యంత నిరాశ పర్చిన డిజాస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..?
తర్వాత మూడో స్థానంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వివరాల కోసం నెటిజన్లు భారీ సంఖ్యలో గూగుల్‌లో వెతికారు. న్యూస్ కేటగిరిలో ఈ పేరు మూడో స్థానంలో నిలిచింది. ఇక నిర్భయ ఘటన నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో బైరుట్ బైరుట్ ఎక్స్ప్లోజన్, ఆరోస్థానంలో లాక్‌డౌన్, ఏడో స్థానంలో చైనా- ఇండియా సరిహద్దుల ఉద్రిక్తతలు, ఎనిమిది స్థానంలో ఆస్ట్రేలియాలో జరిగిన బుష్ ఫైర్, తొమ్మిదో స్థానంలో లోకుస్ట్ స్వర్మ్ అటాక్, పదో స్థానంలో రామ మందిర నిర్మాణం వంటివి నిలిచియి.
నెటిజన్లు అధికంగా సెర్చ్ చేసింది వీరినే..
కాగా, 2020లో భారతీయ నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల కేటగిరీల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్(Joe Biden) నిలిచారు. రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి(Arnab Goswami) రెండో స్థానం, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ (Kanika Kapoor ), ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong-un), నటుడు అమితాబ్ బచ్చన్, సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్, నటి రియా చక్రవర్తి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, బాలీవుడ్ నటి అంకితా లోక్‌నాథ్, కంగనా రనౌత్ వంటి పదాలు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో టాప్ 10లో నిలిచారు.
అలాగే దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ (Shushant Singh Rajput ) నటించిన ‘దిల్ బెచారా’ సినిమా నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన చిత్రాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక టీవీ, వెబ్ సిరీస్ జాబితాలో ‘మనీ హీస్ట్’, మీర్జాపూర్ 2, స్మాషింగ్ హీట్ టాప్ లో నిలిచాయి.
Also Read:
Political Leaders died in 2020: ఈ సంవత్సరంలో ఎవరెవరు రాజకీయ ప్రముఖులు మరణించారంటే..
Nobel Prizes 2020: ఈ ఏడాదిలో నోబెల్ పురస్కారాలు పొందిన ప్రముఖులు వీరే.. ఏ రంగంలో ఎవరంటే..
2020 Round-up : 2020లో ఈ లోకాన్ని వీడి అభిమానులను శోకసంద్రంలోకి నెట్టిన సినీ తారలు..
2020 Round Up : కరోనా సమయంలోనూ సత్తా చాటి..ప్రేక్షుకుల మనసులు గెలిచిన కొత్త దర్శకులు వీరే