Nobel Prizes 2020: ఈ ఏడాదిలో నోబెల్ పుర‌స్కారాలు పొందిన ప్ర‌ముఖులు వీరే.. ఏ రంగంలో ఎవ‌రంటే..

2020 సంవ‌త్స‌రంలో ప‌లువురు నిపుణులు, వైద్యులు ప‌లు రంగాల్లో నోబెల్ పుర‌స్కారాల‌ను అందుకున్నారు. ఈ ఏడాది నోబ‌ల్ పుర‌స్కారాల‌ను ఎవ‌రెవ‌రు అందుకున్నారంటే..

Nobel Prizes 2020: ఈ ఏడాదిలో నోబెల్ పుర‌స్కారాలు పొందిన ప్ర‌ముఖులు వీరే.. ఏ రంగంలో ఎవ‌రంటే..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 28, 2020 | 3:35 PM

2020 సంవ‌త్స‌రంలో ప‌లువురు నిపుణులు, వైద్యులు ప‌లు రంగాల్లో నోబెల్ పుర‌స్కారాల‌ను అందుకున్నారు. ఈ ఏడాది నోబ‌ల్ పుర‌స్కారాల‌ను ఎవ‌రెవ‌రు అందుకున్నారంటే..

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత‌లు వేలం పాట నిర్వ‌హ‌ణ‌కు కొత్త‌, మెరుగైన ప‌ద్ద‌తుల‌ను సృష్టించ‌డంతో పాటు వేలం పాట‌ల సిద్దాన్ని మ‌రింత మెరుగు ప‌ర్చిన అమెరిక‌న్ ఆర్థిక‌ శాస్త్ర‌వేత్త‌లు, స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు పాల్ ఆర్ మిల్ గ్రూమ్‌, రాబ‌ర్డ్ బి విల్స‌న్‌ల‌కు 2020 ఏడాది ఆర్థిక నోబెల్ పుర‌స్కారం ల‌భించింది. ఈ మేర‌కు రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సెన్సైస్ సెక్ర‌ట‌రీ జ‌న‌‌ర‌ల్ గొరాన్ హాన్స‌న్ అక్టోబ‌ర‌ర్ 12న విజేత‌ల‌ను ప్ర‌‌క‌టించారు. ఆర్థిక శాస్త్ర నోబెల్ పుర‌స్కారం కింద రూ.8.32 కోట్ల న‌గ‌దు, బంగారు ప‌త‌కం ల‌భించాయి. అయితే వేలం పాట‌లు ఎలా ప‌ని చేస్తాయ‌న్న విష‌యాన్ని ప‌రిశీలించిన అవార్డు గ్ర‌హీత‌లు సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో అమ్మ‌డం వీలుకాని వ‌స్తు, సేవ‌ల‌ను విక్ర‌య విక్ర‌యించేందుకు కొత్త వేలం ప‌ద్ద‌తుల‌ను ఆవిష్క‌రించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అమ్మ‌కందారులు, ఇటు వినియోగ‌దారుల‌తో పాటు ప‌న్ను చెల్లింపుదారులు ల‌బ్ది పొందార‌ని నోబెల్ బ‌హుమ‌తుల క‌మిటీ తెలిపింది. కాగా, రాబ‌ర్ట్ విల్స‌న్ పూర్వ విద్యార్థి అయిన మిల్‌గ్రూమ్‌లు..వేలం పాట సిద్దాంతం ఆధారంగా వేలం పాట జ‌రిగే తీరు, తుది ధ‌ర‌లు, వేలంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసే నిబంధ‌న‌లు వంటి అంశాల‌ను ప‌‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం ద్వారా తుది ఫ‌లితాల‌ను అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో వారికి నోబెల్ పుర‌స్కారం ల‌భించింది.

భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేత‌లు భౌతిక శాస్త్రంలో నోబెల్ పుర‌స్కారానికి ముగ్గురు ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌లు సంయుక్తంగా ఎంపిక‌య్యారు. రోజ‌ర్ పెన్రోజ్‌, రెయిన్ హార్డ్ గెంజెల్‌, ఆండ్రియా గేజ్‌ల‌కు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్‌-2020 ల‌భించింది. కృష్ణ బిలంపై ప‌రిశోధ‌న‌లు చేసినందుకు, పాల‌పుంత మ‌ధ్య భాగంలో సూప‌‌ర్‌మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ను క‌నుగొన్నందుకు వీరిని నోబెల్ పుర‌స్కారానికి ఎంపిక చేశారు. కాంతిని కూడా తనలో లయం చేసుకోగల అపారశక్తి కేంద్రం కృష్ణబిలంపై మన అవ‌గాహనను మరింత పెంచిన బ్రిటిష్‌ శాస్త్రవేత్త రోజర్‌ పెన్‌రోజ్‌, జర్మనీకి చెందిన రైన్‌హార్డ్‌, అమెరికన్‌ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్‌లకు 2020 ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్‌ అవార్డు దక్కింది. మన పాలపుంత మధ్య భాగంలో నక్షత్రాల కక్ష్యలపై కంటికి కనిపించని, అత్యంత భారీ పదార్థం ప్రభావం చూపుతోందని రెయిన్‌ హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా గెజ్‌ కనుగొన్నారు. అలర్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రూపొందించిన సాపేక్షతకు సంబంధించిన సామాన్య సిద్దాంతాన్ని తెలిపేందుకు రోజర్‌ పెన్రోజ్‌ అత్యంత సృజనాత్మక గణిత పద్దతులను కనుగొన్నారు. కాగా, నోబెల్‌ బహుమతి కింద 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (9.18 లక్షల అమెరికన్‌ డాలర్లు) చెల్లిస్తారు. ఈ బహుమతి మొత్తంలో సగం రోజర్‌ పెన్రోజ్‌ ఇస్తారు. మిగిలిన సగం రెయిన్‌ హార్డ్‌, గెంజెల్‌, ఆండ్రియా గేజ్‌లకు ఇస్తారు.

రసాయన శాస్త్రం‌ నోబెల్‌ విజేతలు 2020 సంవత్సరానికి సంబంధించి నోబెల్‌ బహుమతి విజేతలుగా స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. వీటిలో మహిళలు తమ సత్తా చాటారు. రసాయన శాస్త్రవేత్త విభాగానికి సంబంధించి ఈ బహుమతి ఇద్దరు మహిళలకు దక్కింది. ఫ్రెంచ్‌ ప్రొఫెసర్‌ ఎమ్మాన్యుయెల్‌ షార్సెంటైర్‌కు, అమెరికన్‌ బయోకెమిస్ట్ జెన్నిఫర్‌ దౌడ్నాకు ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం దక్కింది. అయితే జినోమ్‌ మార్పులపై చేసిన పరిశోధనలకు గానూ ఈ అవార్డు వరించింది. ఇక ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు, వైద్య రంగంలో ముగ్గురుకు నోబెల్‌ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఇక నోబెల్‌ శాంతి బహుమతిని అక్టోబర్‌ 9న ప్రకటించారు. నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన ఫాజియా కూఫీ ఉన్నారు. జన్యువులను మన అవసరమైన రీతిలో ఖచ్చితంగా కత్తిరించేందుకు క్రిస్పర్‌ క్యాస్‌-9 అనే నూతన పద్దతిని ఆవిష్కరించిన ఫ్రాన్స్‌ శాస్త్రవేత్త ఎమ్మాన్యుల్‌ షార్సెంటైర్‌, అమెరికన్‌ శాస్త్రవేత్త జెన్నిపర్ దౌడ్నాలకు 2020 ఏడాది రసాయన శాస్త్ర నోబెల్‌ బహుమతి లభించింది.

వైద్యశాస్త్రంలో నోబెల్‌ విజేతలు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనల ఫలితంగా రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్‌ గురించి ప్రపంచానికి తెలిసిందని, హెపటైటిస్‌ ఏ, బీ ల ద్వారా ఈ విషయం తెలియలేదని నోబెల్‌ కమిటీ అక్టోబర్‌ 5న స్టాక్‌ హోమ్‌లో అవార్డును ప్రకటించారు. వీరి పరిశోధనల ఫలితంగా హెపటైటిస్‌-సి గుర్తింపులకు కొత్త రక్త పరీక్షలు, వైద్యానికి కొత్త మందులు అందుబాటులోకి వచ్చి లక్షల మంది ప్రాణాలు నిలిచాయని తెలిసింది. అవార్డు కింద బంగారు పతకం, కోట స్వీడిష్‌ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అవార్డు గ్రహీతలు ముగ్గురూ నగదు బహుమతిని సమానంగా పంచుకుంటారు.కాగా, హెపటైటిస్‌-సీ వైరస్‌ కారణంగా కాలేయానికి వచ్చే సమస్య ఇది. రక్తం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. అకస్మాత్తుగా కనిపించి కొన్ని వారాల్లో తగ్గిపోవడం ఒక రకమైన హెపటైటిస్‌-సీ వ్యాధి లక్షణమైతే కాలేయాన్ని తీవ్రంగా దెబ్బ తీసి కేన్సర్‌కు, కొన్ని సమయాల్లో మరణాలకు దారి తీసే క్రానిక్‌ హెపటైటిస్‌-సీ రెండో రకం. ఇందులో హార్వీ జె ఆలర్ట్‌ రక్త మార్పిడి అనుబంధ హెపటైటిస్‌ వైరస్‌ తరచూ వచ్చే హెపటైటిస్‌కు కారణమని నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం 2020 ఏడాదికి అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అక్టోబర్‌ 9న నోబెల్‌ కమిటీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు కృషి చేసిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌కు ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం వరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి చావుల నివారణ, అదే విధంగా సంక్షోభ ప్రాంతాల్లో అందించిన సేవలకు గానూ డబ్ల్యూఎఫ్‌పీ ఎంతో దోహదపడిందని నోబెల్‌ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌కు నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించినట్లు స్టాక్‌ హోమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నోబెల్‌ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో
సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
రూ.1074కే జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్
రూ.1074కే జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్
అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు ఇవి.. ఏది బెస్ట్?
అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు ఇవి.. ఏది బెస్ట్?