అక్కడ 30 మంది కరోనా బాధితుల కోసం పోలీసుల వేట
కరోనా మహమ్మారి కరాళనృత్యానికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. వైరస్ సోకినవారిని అధికారులు క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కరోనా బాధితులు అధికారుల కళ్లుగప్పి పారిపోతున్నారు
కరోనా మహమ్మారి కరాళనృత్యానికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. వైరస్ సోకినవారిని అధికారులు క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కరోనా బాధితులు అధికారుల కళ్లుగప్పి పారిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడచిన 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి మించిన మరొక ముప్పు వారణాసిలో చోటుచేసుకుంది. 30 మందికి పైగా కరోనా బాధితులు తప్పుడు ఫోన్ నంబర్, చిరునామా ఇచ్చి మాయమయ్యారు. దీంతో స్థానికుల్లోభయాందోళనలు ఎక్కువయ్యాయి. ఆరోగ్యశాఖ బృందం వీరికి చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆరోగ్యశాఖ సిబ్బంది కరోనా రోగులను వెతికేపనిలోపడ్డారు. ఇందుకు ప్రత్యేక పోలీసు బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ బాధితులంతా వారణాసిలోని వివిధ పోలీస్‌స్టేషన్ పరిధుల్లోని ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. అయితే వీరంతా స్వేచ్ఛగా తిరుగుతుండటంతో స్థానికులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు.