జూన్ 4న కేరళలోకి నైరుతి రుతుపవనాలు: స్కైమెట్
అనుకున్నదాని కంటే మూడు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు స్కైమెట్ అధికారులు తెలిపారు. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు స్కైమెట్ పేర్కొంది. జులై మధ్య నాటికి దేశమంతా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పంట దిగుబడి కూడా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఆర్థిక ప్రగతి కూడా బాగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సాధారణ వర్ష పాతం […]

అనుకున్నదాని కంటే మూడు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు స్కైమెట్ అధికారులు తెలిపారు. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు స్కైమెట్ పేర్కొంది. జులై మధ్య నాటికి దేశమంతా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పంట దిగుబడి కూడా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఆర్థిక ప్రగతి కూడా బాగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సాధారణ వర్ష పాతం నమోదయ్యే ప్రాంతాలు 70 శాతం కన్నా ఎక్కువే ఉన్నట్లు స్కైమెట్ సీఈవో తెలిపారు. దేశానికి 93 శాతం వర్షపాతం ఈ నైరుతి రుతుపవనాల వల్ల కలుగనుంది. రైతాంగం ఎక్కువగా దీనిపైనే ఆధారపడి ఉంది.



