Mixed Vegetable Noodles: టేస్టీ టేస్టీ మిక్సిడ్ వెజిటబుల్ మసాలా న్యూడిల్స్ తయారీ ఎలా అంటే..!
Mixed Vegetable Noodles: మన సంపద్రాయ వంటలతో పాటు. విదేశీ వంటలు కూడా అడుగు పెట్టాయి. ఫ్రైడ్ రైస్, మంచూరియా.. మేగీ , న్యూడిల్స్ వంటివి మన వంటల్లో..
Mixed Vegetable Noodles: మన సంపద్రాయ వంటలతో పాటు. విదేశీ వంటలు కూడా అడుగు పెట్టాయి. ఫ్రైడ్ రైస్, మంచూరియా.. మేగీ , న్యూడిల్స్ వంటివి మన వంటల్లో భాగమయ్యాయి. వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొంత మంది.. చైనా వంటలకు .. ఇండియన్ స్టైల్ యాడ్ చేసి.. సరికొత్త వంటకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈరోజు మిక్సిడ్ వెజిటబుల్ మసాలా న్యూడిల్స్ తయారీ చూద్దాం..!
కావాల్సిన పదార్ధాలు:
న్యూడిల్స్ క్యారెట్స్ రంగు రంగుల క్యాప్సికం ముక్కలు ఉల్లి పాయలు పచ్చిమిర్చి క్యాబేజీ బేబీ కార్న్ టొమేటో ఎవరెస్ట్ కింగ్ మసాలా పొడి నూనె వేయించడానికి సరిపడా కారం ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా న్యూడిల్స్ ను ఉడికించి .. వాటిలో నుంచి నీరు తీసి.. చల్లార్చుకోవాలి. తర్వాత బేబీ కార్న్ కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలి పెట్టుకుని .. నూనె వేసి.. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని తర్వాత క్యారెట్ ముక్కలు , రంగు రంగుల క్యాప్సికం ముక్కలు , ఉల్లి పాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , క్యాబేజీ ముక్కలు , టామాటో ముక్కలు వేయించుకోవాలి. తర్వాత ఉప్పు , కొంచెం కారం, కొంచెం ఎవరెస్ట్ కింగ్ కర్రీ మసాలా పొడి వేసుకుని కొంచెం సేపు వేయించాలి. తర్వాత స్వీట్ కార్న్ వేసుకుని కొంచెం సేపు వేయించి.. చివరిగా న్యూడిల్స్ ను వేసుకుని కొంచెం సేపు ఉడికించి దించేసుకోవాలి.. అంతే ఎంతో రుచికరమైన మిక్సిడ్ వెజిటబుల్ మసాలా న్యూడిల్స్ రెడీ..
Also Read: మనిషి జీవితమే ఈ చిదంబరం ఆలయం .. ఇక్కడ ఎన్నో రహస్యాలు.. అవన్నీ చిదంబర రహస్యమే..!
ఒడిశాలో కరోనా నిబంధనలు అమలు.. శని, ఆదివారాల్లో పూరి జగన్నాథ్ ఆలయం మూసివేత..