ఎనిమిది నెలలుగా జవాన్ మిస్.. మంచులో మృతదేహం లభ్యం

ఎనిమిది నెలలుగా కనిపించని ఆర్మీ జవాన్ మృతదేహం ఎట్టకేలకు లభించింది. భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద మంచు కింద శనివారం అర్మీ అధికారులు గుర్తించారు.

ఎనిమిది నెలలుగా జవాన్ మిస్.. మంచులో మృతదేహం లభ్యం
Follow us

|

Updated on: Aug 16, 2020 | 3:29 PM

ఎనిమిది నెలలుగా కనిపించని ఆర్మీ జవాన్ మృతదేహం ఎట్టకేలకు లభించింది. భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద మంచు కింద శనివారం అర్మీ అధికారులు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చమోలి గ్రామానికి చెందిన రాజేంద్ర సింగ్ నేగి (36) 2001లో ఆర్మీలో చేరారు. జమ్ముకశ్మీర్‌లోని 11 గర్హ్వాల్ రైఫిల్స్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, గుల్మార్గ్ ప్రాంత సరిహద్దులోని ఎల్‌వోసీ వద్ద విధుల్లో ఉండగా జనవరి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో హవల్దార్ రాజేంద్ర సింగ్ అమరుడైనట్లు జూన్ 21న ఆర్మీ ప్రకటిస్తూ ఆయన కుటుంబానికి లేఖ రాసింది. కాగా, తన భర్త మృతదేహన్ని కళ్లారా చూసేంత వరకు ఈ విషయాన్ని తాను అంగీకరించబోనని భార్య రాజేశ్వరి దేవి తెలిపింది.

ఇదిలావుండగా, శనివారం దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ తనిఖీలు చేపట్టగా భారీ మంచు కింద జవాన్ రాజేంద్ర సింగ్ మృతదేహం లభించింది. దీంతో శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి రాజేంద్ర పార్థీవదేహన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. జవాన్ భార్య నివాసం ఉంటున్న డెహ్రాడూన్‌కు రాజేంద్ర సింగ్ పార్థీవ దేహన్ని పంపిస్తామని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఆర్మీ అధికారులు. దీంతో చమోలిలో ఉంటున్న జవాన్ తల్లిదండ్రులు డెహ్రాడూన్‌కు చేరుకుంది. సైనిక లాంఛనాల నడుమ ఆయన పార్థీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..