AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుంగభద్ర నది స్నానాలకు అనుమతి…రేపటి నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలు

తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. డిసెంబర్‌ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయని చెప్పారు.

తుంగభద్ర నది స్నానాలకు అనుమతి...రేపటి నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలు
Vellampalli
Sanjay Kasula
|

Updated on: Nov 19, 2020 | 10:02 PM

Share

Tungabhadra Pushkars : తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. డిసెంబర్‌ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే ఘాట్‌లోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్నానాలను నిషేదించిట్లు మంత్రి వెల్లంపల్లి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని మంత్రి గుర్తు చేశారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు.