అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే.. యరపతినేని ఆస్తులపై సీబీఐ సోదాలు.. ఏకకాలంలో 25 చోట్ల దాడులు

సున్నపురాయి అక్రమమైనింగ్ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అస్తులపై సీబీఐ సోదాలు ప్రారంభించింది.

అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే.. యరపతినేని ఆస్తులపై సీబీఐ సోదాలు.. ఏకకాలంలో 25 చోట్ల దాడులు

సున్నపురాయి అక్రమమైనింగ్ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అస్తులపై సీబీఐ సోదాలు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఒకేసారి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు, హైదరాబాద్‌లోని ప్రాంతాల్లో యరపతినేని కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే యరపతినేని నివాసాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ, పలు డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అక్రమ మైనింగ్‌కు సంబంధించిన యరపతినేనిపై 17 కేసులను సీబీఐకు సీఐడీ బదిలీ చేసింది. అగష్టు 26వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్ పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని అక్రమ మైనింగ్ జరిగాయని ఆభియోగాలు వచ్చాయి. శానిలైట్ ఇమేజెస్‌ అధారంగా అధికారులు మైనింగ్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో యరపతినేనికి చెందిన కార్యాలయాలు, నివాసాలపై సీబీఐ ఏకకాలంలో 25 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఇంకా రెండు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.