సెప్టెంబర్ 5న తెరుచుకోనున్న పాఠశాలలు: సురేష్

రాష్ట్రంలో పాఠశాలలను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

సెప్టెంబర్ 5న తెరుచుకోనున్న పాఠశాలలు: సురేష్
Follow us

|

Updated on: Aug 12, 2020 | 5:57 PM

కరోనా ప్రభావంతో మూతపడ్డ విద్యాసంస్థలను మెల్లమెల్లగా తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే విద్యార్థులు కావల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలను తెరిచి ఈ విద్యాసంవత్సరాన్ని పున:ప్రారంభించాలని నిర్ణయిచింది. రాష్ట్రంలో పాఠశాలలను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఆగస్టు 31 వరకు స్కూల్స్ ప్రారంభించకూడదని ఆదేశాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి సురేష్.. పాఠశాలల ప్రారంభంపై ఆగస్టు 31 తరువాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా నాడు – నేడు పనులను పూర్తి చేసి పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. అదే రోజు 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా ఈ నెలాఖరు కల్లా ఉండే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??