AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ చుక్ చుక్ రైలు

హైదరాబాద్‌ మహానగర కీర్తికిరీటంలో మరో మణిహారం వచ్చి చేరబోతోంది. సాగర హారంకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకునే హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌ లైన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై హెచ్‌ఎండీఏ(HMDA) అధికారులతో సంప్రదించి డీపీఆర్‌ సిద్ధం చేయాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. నూతన టూరిజం ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత స్థలాల్లో టూరిజం ప్రాజెక్టుల డిజైన్‌లను అనుభవం ఉన్న కన్సల్టెంట్‌ల ద్వారా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా […]

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ చుక్ చుక్ రైలు
Sanjay Kasula
|

Updated on: Oct 08, 2020 | 5:40 AM

Share

హైదరాబాద్‌ మహానగర కీర్తికిరీటంలో మరో మణిహారం వచ్చి చేరబోతోంది. సాగర హారంకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకునే హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌ లైన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై హెచ్‌ఎండీఏ(HMDA) అధికారులతో సంప్రదించి డీపీఆర్‌ సిద్ధం చేయాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు.

నూతన టూరిజం ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత స్థలాల్లో టూరిజం ప్రాజెక్టుల డిజైన్‌లను అనుభవం ఉన్న కన్సల్టెంట్‌ల ద్వారా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

కొత్తగా ఏర్పాటు చేసే ప్రాజెక్టులపై ప్రముఖ కన్సల్టెంట్‌లు రూపొందించిన ప్రాజెక్టుల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లను మంత్రి పరిశీలించారు. ప్రముఖ సంస్థలతో చర్చించి దుర్గంచెరువుతోపాటు కాళేశ్వరం, మిడ్‌ మానేరు, కొండపోచమ్మ, సోమశిలలో కొత్తగా చేపట్టనున్న టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు.

సమీక్షలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, పర్యాటకశాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీశ్‌, పర్యాటకశాఖ ఎండీ మనోహర్‌, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల