ఢిల్లీ క్రికెట్ సంఘ అధ్యక్ష పోటీలో మాజీ కేంద్ర మంత్రి కుమారుడు

ఢిల్లీతోపాటు జిల్లాల క్రికెట్‌ సంఘం (DDCA) అధ్యక్ష రేసులో  దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహన్‌ నిలిచాడు. బుధవారం అతను నామినేషన్‌ సమర్పించాడు. మరో అభ్యర్తి సునీల్‌ గోయల్‌..

  • Sanjay Kasula
  • Publish Date - 5:17 am, Thu, 8 October 20
ఢిల్లీ క్రికెట్ సంఘ అధ్యక్ష పోటీలో మాజీ కేంద్ర మంత్రి కుమారుడు

rohan : ఢిల్లీతోపాటు జిల్లాల క్రికెట్‌ సంఘం (DDCA) అధ్యక్ష రేసులో  దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహన్‌ నిలిచాడు. బుధవారం అతను నామినేషన్‌ సమర్పించాడు. మరో అభ్యర్తి సునీల్‌ గోయల్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో రోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రోహన్ వెల్లడించాడు. న్యాయవాది అయిన 31 ఏళ్ల రోహన్‌ పేర్కొన్నాడు.

అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశాను. ఢిల్లీ క్రికెట్‌ను మెరుగ్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అని అన్నాడు. అనవసరమైన ఖర్చులు తగ్గించేలా చూస్తానని హామీ ఇస్తున్నాను అని పేర్కొన్నాడు. అవినీతికి ఆస్కారం లేకుండా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తా వెల్లడించాడు.  మరోవైపు కోశాధికారి పదవి కోసం టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, ప్రస్తుత ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ మేనమామ పవన్‌ గులాటి నామినేషన్‌ వేశాడు.