మెరిసింది ఒకే ఒక్కడు..

విధ్వంసకారులతో నిండిన కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ చెన్నై బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. అంచనాల్లేకుండా ఓపెనర్‌గా అడుగు పెట్టిన ఆ కుర్రాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడే స్కోరు సాధించి పెట్టాడు.

మెరిసింది ఒకే ఒక్కడు..
Follow us

|

Updated on: Oct 08, 2020 | 4:57 AM

Rahul Tripathi’s Rritty : గత మ్యాచ్‌లో ఓపెనర్ల అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనలో భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ఆ జట్టు.. ఈ సారి ఆ ఇద్దరు ఒకరు విఫలమవగానే జట్టు మొత్తం తేలిపోయింది. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టుకు కళ్లెం వేసింది. బౌలర్ల ఆధిపత్యం సాగిన ఈ మ్యాచ్‌లో మొనగాడు మాత్రం రాహుల్ త్రిపాఠినే. విధ్వంసకారులతో నిండిన కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ చెన్నై బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. అంచనాల్లేకుండా ఓపెనర్‌గా అడుగు పెట్టిన ఆ కుర్రాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడే స్కోరు సాధించి పెట్టాడు.

ఇక మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మళ్లీ ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిడిల్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌(50 /40 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) ఒంటరి పోరాటం వృథా అయింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేసింది. బౌలర్లు సమిష్టిగా పోరాడటంతో పాటు రాహుల్‌ త్రిపాఠి(81/ 51 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో మెరవడంతో కోల్‌కతా విజయం సాధించింది.

గత మ్యాచ్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపించిన రాహుల్ త్రిపాఠి.. ఈ సారి ఓపెనర్ అవతారమెత్తి చెలరేగిపోయాడు. వికెట్ల వేడుక చేసుకున్న చెన్నై బౌలర్లకు త్రిపాఠి కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఒక్కడే ఎదురు నిలిచాడు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లో 167 పరుగులు చేసి ఆలౌటైంది. ఆరు మ్యాచ్‌లాడిన చెన్నైకిది నాలుగో ఓటమి కాగా..అయిదు మ్యాచ్‌ల్లో కోల్‌కతాకిది మూడో గెలుపు

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా