AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర వ్యవసాయ బిల్లుపై అపోహలు వద్దుః నిర్మలా సీతారామన్

ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

కేంద్ర వ్యవసాయ బిల్లుపై అపోహలు వద్దుః నిర్మలా సీతారామన్
Balaraju Goud
|

Updated on: Oct 07, 2020 | 10:58 PM

Share

ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందులో భాగంగానే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్‌ బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు రైతులు, వ్యవసాయ రంగం నిపుణులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందనేది తప్పుడు ప్రచారమని ఆమె అన్నారు. మార్కెట్ కమిటీలను తొలగిస్తామని కాంగ్రెస్ చెప్పిందా లేదా అని ప్రశ్నించారు. మార్కెట్ యార్డుల పన్ను, మధ్యవర్తుల పన్ను రైతులపై భారంగా ఉందని, కొత్త చట్టాలతో మార్కెట్‌కు వెళ్ళకుండానే సరుకు అమ్ముకోవచ్చని తెలిపారు. కొత్త చట్టాలతో దళారులకే నష్టమని, రైతులకు కాదని స్పష్టం చేశారు. కష్టపడి పంట పండించే రైతుకు మంచి మద్దతు ధర ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అతి తక్కువ వర్ష పాతం ఉండే ఖచ్ ప్రాంతంలో ఎక్కువ హార్టికల్చర్ పండుతోందని, డ్రిప్ వల్లనే ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కృషీ చేస్తుందన్నారు నిర్మలా సీతారామన్.

Follow Us
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!
రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే కూల్ కూల్
రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే కూల్ కూల్
యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం
యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం
పెట్రోల్ బంక్‌లో ఈ నంబర్ గమనించారా? మైలేజీకి దీనికి సంబంధం ఏమిటి?
పెట్రోల్ బంక్‌లో ఈ నంబర్ గమనించారా? మైలేజీకి దీనికి సంబంధం ఏమిటి?
నటుడు సౌరవ్ గుజ్జర్ పై కేసు నమోదు..
నటుడు సౌరవ్ గుజ్జర్ పై కేసు నమోదు..