మంత్రి మల్లారెడ్డికి మేడారానికి లింకు..మ్యాటర్ తెలిస్తే నవ్వులే!
మేడారం జాతరకు రాజకీయ నేతలు పరుగులు పెడుతున్నారు. వనదేవతల ఆశీర్వాదం కోసం క్యూ కడుతున్నారు. జాతరకు నాయకులు వెళ్లడం సహజం..మొక్కులు చెల్లించుకోవడం కామన్ ..ఇందులో స్పెషలే ఏముంది అనుకుంటున్నారా…కానీ ఇక్కడే ఓ మర్మం దాగుంది. దశాబ్దాలుగా జాతర జరుగుతోంది..పొలిటికల్ లీడర్స్ వెళ్తారు..వస్తారు..కానీ ఈ జాతరకు వెళ్తున్న రాజకీయ నేతల కాన్సెప్ట్ అమ్మ ఆశీస్సులే కాదు..స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడా సిద్ధించాలన్న ఆశయంతో ఆశీస్సులు తీసుకునేందకుు బయలుదేరుతున్నారు. ఇంతకూ ఆస్వామికార్యంలో దాగున్న స్వకార్యం ఏంటి..? ఎక్కడికైనా ఊరికే వెళ్లరు […]
మేడారం జాతరకు రాజకీయ నేతలు పరుగులు పెడుతున్నారు. వనదేవతల ఆశీర్వాదం కోసం క్యూ కడుతున్నారు. జాతరకు నాయకులు వెళ్లడం సహజం..మొక్కులు చెల్లించుకోవడం కామన్ ..ఇందులో స్పెషలే ఏముంది అనుకుంటున్నారా…కానీ ఇక్కడే ఓ మర్మం దాగుంది. దశాబ్దాలుగా జాతర జరుగుతోంది..పొలిటికల్ లీడర్స్ వెళ్తారు..వస్తారు..కానీ ఈ జాతరకు వెళ్తున్న రాజకీయ నేతల కాన్సెప్ట్ అమ్మ ఆశీస్సులే కాదు..స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడా సిద్ధించాలన్న ఆశయంతో ఆశీస్సులు తీసుకునేందకుు బయలుదేరుతున్నారు. ఇంతకూ ఆస్వామికార్యంలో దాగున్న స్వకార్యం ఏంటి..?
ఎక్కడికైనా ఊరికే వెళ్లరు రాజకీయ నేతలు. అది జాతరైనా…జనం దగ్గరకైనా. ఇప్పుడు మేడారం జాతరకు పొలిటికల్ లీడర్స్ పనిగట్టుకుని వెళ్లడం వెనుక ఓ రాజకీయ రహస్యం దాగుందట. ఆ రహస్యమే పదవీయోగం. ఈ యోగం కోసం కొందరు యాగాలు చేస్తారు..మరికొందరు మొక్కులు చెల్లించుకుంటారు..కానీ అవుతామన్న గ్యారంటీ..వారంటీ లేదు. కానీ మేడారంలో మొక్కులు చెల్లించుకునంటే మాత్రం గ్యారంటీగా పదవీ యోగం ఉందనే నానుడి తెలంగాణ నేతలు తెగ నమ్ముతున్నారు. అందుకు రీజనబుల్ రీజన్స్ కూడా ఇస్తున్నారు. ఆ రీజనబుల్ రీజనే మల్లారెడ్డి రాజకీయమట…
అది 2014. ఎన్నికల కాలం. మల్కాజిగిరి ఎంపీగా మల్లారెడ్డి పోటీ చేస్తున్న సందర్భం. గెలుస్తానో లేదో అన్న సంశయం. ఆసమయంలోనే మల్లారెడ్డి మేడారం జాతరకు వెళ్లారు. వనదేవతలకు మొక్కుకున్నారు. తనను ఎంపీగా గెలిపించాలని కోరుకున్నారు. మల్లారెడ్డి కోరుకున్నట్లే 2014లో టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా మల్కాజిగిరి బరిలో ఎంపీగా ఘనవిజయం సాధించారు.
తర్వాత రాజకీయ పరిస్థితుల కారణంగా మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. అయితే ఎంపీ కల నెరవేరింది..ఇప్పుడు మంత్రి కావాలనే ఆశపడ్డారు. మల్కాజగిరి నుంచి మళ్లీ ఎంపీగా గెలిస్తే లాభం లేదని మల్లారెడ్డి తలిచారు. కేంద్రంలో టీఆర్ఎస్ చేరిన… తనకు మంత్రి పదవి రాదని లెక్కలు వేసుకున్న మల్లారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గెలిచారు. ఇప్పుడు మంత్రి అయ్యారు.
మల్లారెడ్డి అనుకున్నది అనుకున్నట్లు కావడానికి కారణం మేడారం మొక్కులేనట. ఈ విషయం పోయిన సారి మేడారం జాతరలో సీఎం కేసీఆర్ సమక్షంలోనే తన సక్సెస్ సీక్రెట్‌ను బయటపెట్టారు మల్లారెడ్డి. సీఎం కేసీఆర్‌తో పాటు మేడారం సమ్మక్క సారక్క మొక్కుల కోసం వెళ్లిన మల్లారెడ్డి కేసీఆర్ సమక్షంలోనే ముచ్చట్లు జరిగాయి. మల్లన్న ఏం మొక్కు మొక్కుకున్నవని కేసీఆర్ అడగ్గానే మంత్రి కావాలని కోరుకున్నట్లు తెలిపారు. స్టేటా….సెంట్రలా అని అడగ్గానే రాష్ట్రంలోనే అని జవాబు ఇచ్చారు.
అంతకుముందు మేడారం వచ్చి ఎంపీగా గెలవాలని కోరుకుంటే…ఎంపీ అయ్యానని.. ఈసారి మంత్రి కావాలని కోరుకున్నట్లు చెప్పారు. దీంతో సీఎం వెంటనే పక్కనే ఉన్న నాయినితో పాటు ఇతర మంత్రులతో చూశావా…నీ పదవికి ఎసరు పెడుతున్నారని అప్పట్లో జోక్ వేశారు సీఎం కేసీఆర్. అన్నట్లుగానే నాయిని పదవికి మల్లారెడ్డి ఎసరు పెట్టారు. నాయిని ప్లేస్‌లో మంత్రి పదవి కొట్టేశారు. మల్లారెడ్డి సక్సెస్ మర్మం తెలుసుకున్న తెలంగాణ లీడర్స్..ఇప్పుడు మేడారానికి క్యూ కడుతున్నారట. తమ మనసులో బలంగా కోరుకుంటూ…వనదేవతలను మొక్కుకుంటున్నారు.