బడ్జెట్ 2020: ఆశాజనకంగా కేంద్ర బడ్జెట్.. కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రూపాయ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది రాష్ట్రాల బడ్జెట్ కాదని, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో జాతీయ స్థాయి అంశాల గురించి ప్రస్తావన ఉంటుంది తప్ప రాష్ట్రాలవారీ కేటాయింపుల గురించి ప్రస్తావనేదీ ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఎవరూ […]

బడ్జెట్ 2020: ఆశాజనకంగా కేంద్ర బడ్జెట్.. కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రూపాయ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది రాష్ట్రాల బడ్జెట్ కాదని, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో జాతీయ స్థాయి అంశాల గురించి ప్రస్తావన ఉంటుంది తప్ప రాష్ట్రాలవారీ కేటాయింపుల గురించి ప్రస్తావనేదీ ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాతీయ ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు సమృద్ధిగా నిధులు వస్తున్నాయని, జీఎస్టీలో సగం రాష్ట్రాలకే వెళ్తోందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదని అన్నారు.

మొత్తమ్మీద చూస్తే బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా ఉందని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, హరిత విప్లవం, నీలి విప్లవం (ఆక్వా కల్చర్)కు అధిక ప్రాధాన్యతనివ్వడం, వేతన జీవులకు పన్ను రేటు తగ్గించడం, కేంద్ర పాలిత ప్రాంతాలకు, హోంశాఖకు నిధుల కేటాయింపు పెంచడం వంటి ఎన్నో మంచి నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుంటే, భారత్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రపంచ ప్రజలకే విశ్వాసం కల్పించేదిగా ఉందని ప్రశంసించారు. ఈ బడ్జెట్ చూస్తే విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియాకు ప్రోత్సాహం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా బలోపేతమవుతూ ముందుకెళ్లడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన పెరుగుతాయని, ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేశారు. ఇవన్నీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించి చెప్పడం వల్ల సుదీర్ఘ బడ్జెట్‌గా మారిందని అన్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖకు కేటాయింపులు పెరిగడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ భద్రతకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ పెంచారని, ముఖ్యంగా జమ్ము-కాశ్మీర్‌లో ఈ నిధులను ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పారామిలటరీ బలగాల సంక్షేమం, సదుపాయాలతో పాటు ఆయుధ సంపత్తి ఆధునీకరణ, కొత్త టెక్నాలజీ వినియోగం కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. నిజానికి బడ్జెట్‌లో అధికశాతం పారామిలటరీ సిబ్బంది జీత భత్యాలకే ఖర్చవుతుందని అన్నారు. తాము పారామిలటరీ సిబ్బంది ఆరోగ్యం, హౌజింగ్ పై ఖర్చు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఇన్సెంటివ్ పెంచుతామని  అన్నారు. సుమారు 11 లక్షల మంది పారామిలటరీ సిబ్బంది తమ శాఖ పరిధిలో ఉన్నారని తెలిపారు. ఉన్నంతలో సంక్షేమం, ఆధునీకరణ చేస్తూ కాస్త అటూ ఇటూగా సర్దుకుపోతూ ముందుకెళ్తామని తెలిపారు. కేంద్రం ఇష్టమొచ్చినట్టు నోట్లు ముద్రించలేదని, అందుకే ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకుంటూ సర్దుకుంటూ ముందుకెళ్లాలని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu