వూహాన్ నుంచి ఢిల్లీకి చేరిన ఫ్లైట్.. మరి ఆ 6గురు ఏమయ్యారు..?

ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వుహాన్ నగరంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయుల్ని ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చేస్తున్నారు. తొలుత ఈ విమానంలో 350 మందిని తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. అందుకు భిన్నంగా ఢిల్లీకి 344 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన ఆరుగురు ఎందుకు రాలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వుహాన్ ప్రావిన్స్ మొత్తంలో […]

వూహాన్ నుంచి ఢిల్లీకి చేరిన ఫ్లైట్.. మరి ఆ 6గురు ఏమయ్యారు..?

ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వుహాన్ నగరంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయుల్ని ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చేస్తున్నారు. తొలుత ఈ విమానంలో 350 మందిని తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. అందుకు భిన్నంగా ఢిల్లీకి 344 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన ఆరుగురు ఎందుకు రాలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

వుహాన్ ప్రావిన్స్ మొత్తంలో 600మందికి పైగా భారతీయులు ఉన్నారని… అందులో 400మంది స్వదేశానికి వస్తామని అభ్యర్థించారని అధికారులు చెబుతున్నారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తొలుత అనుకున్నట్లే 350 మంది విమానం లో ఎక్కారు. కాకుంటే.. ఆరుగురు హైఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. వారిని చివరిక్షణాల్లో విమానం నుంచి దించేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారత్ కు వచ్చే ప్రత్యేక విమానంలో ఎక్కేందుకు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ ఆరుగురు విద్యార్థుల్ని అనుమతించలేదు.

వూహాన్ నగరంలో మిగిలిపోయిన వారిని భారతదేశానికి తరలించేందుకు మరో ప్రత్యేక విమానం రప్పిస్తామని బీజింగ్‌ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు చెప్పారు. ప్రస్తుతం వూహాన్ నగరంలో మరికొందరు భారత విద్యార్థులు ఉన్నారు. చైనాలో ఆపేసిన ఆరుగురు విద్యార్థులు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. దీనిపై.. ఆందోళన వ్యక్తమవుతోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu