బీహార్ ఎన్నికల్లో సత్తాచాటిన కొత్త శక్తులు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొత్త శక్తులు అనూహ్యరీతిలో సత్తా చాటడం ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఎంఐఎం పార్టీ బీహార్ లో ఏకంగా 5 సీట్లు గెలుచుకోవడం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీలు 12 స్థానాల్లో గెలుపొందడం ఆసక్తికర పరిణామంగా రాజకీయవిశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రధాన కూటముల గెలుపోటముల్లో కూడా ఈ చిన్నపార్టీలు కీలక పాత్ర పోషించడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎల్జేపీ, ఎంఐఎం వంటి పార్టీలు చీల్చడం గమనార్హం. సీమాంచల్‌లో […]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొత్త శక్తులు అనూహ్యరీతిలో సత్తా చాటడం ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఎంఐఎం పార్టీ బీహార్ లో ఏకంగా 5 సీట్లు గెలుచుకోవడం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీలు 12 స్థానాల్లో గెలుపొందడం ఆసక్తికర పరిణామంగా రాజకీయవిశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రధాన కూటముల గెలుపోటముల్లో కూడా ఈ చిన్నపార్టీలు కీలక పాత్ర పోషించడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎల్జేపీ, ఎంఐఎం వంటి పార్టీలు చీల్చడం గమనార్హం. సీమాంచల్‌లో ఎంఐఎం ప్రభావం కనిపించగా, కిషన్‌గంజ్, ఆమోర్, బహదూర్‌గంజ్, బైసి, ఠాకూర్‌గంజ్, జోకిహాట్, కొంచధామన్ నియోజకవర్గాల్లో ప్రధాన శక్తిగా ఆపార్టీ అవతరించింది. ఈ 7 నియోజకవర్గాల్లో 5 చోట్ల ఎంఐఎం గెలుపు కారణంగా మహా ఘట్‌బంధన్‌కి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లాల్సిన ఓట్లను ఎంఐఎం చీల్చింది. సీమాంచల్‌లో మొత్తం 14 నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ భారీగా ఓట్లను కొల్లగొట్టింది.