బాణాసంచా అమ్మినా, కాల్చినా కఠిన చర్యలు
ఢిల్లీలో నవంబర్ 30 వరకు బాణాసంచా కాల్చినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అక్కడి పోలీసులు.. ఢిల్లీలో రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..
ఢిల్లీలో నవంబర్ 30 వరకు బాణాసంచా కాల్చినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అక్కడి పోలీసులు.. ఢిల్లీలో రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం సంప్రదాయమే అయినా తగ్గిపోతున్న గాలి నాణ్యతను దృష్టిలో పెట్టుకుని పటాకులకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు పోలీసులు.. బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించామని పోలీస్ కమిషనర్ శ్రీవాత్సవ చెప్పారు. ఎవరైనా బాణాసంచా అమ్మినట్టుగాని, కాల్చినట్టుగాని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటివారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. బాణాసంచా అమ్మకాలకు సంబంధించి ఇప్పటి వరకు జారీ చేసిన అనుమతులను రద్దు చేశామని శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో కాలుష్యం అధికమవుతుండటంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ బాణాసంచా వినియోగంపై ఈ నెల 30 వరకు నిషేధం విధించింది.. ఇదిలా ఉంటే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతున్నది.. దీంతో అక్కడ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.