ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్‌ లింక్ కలకలం

తిరుమల దేవస్థానానికి చెందిన ఎస్వీబీసీ(శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌)లో పోర్న్‌ సైట్ లింక్‌ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు

ఎస్వీబీసీలో పోర్న్‌ సైట్‌ లింక్ కలకలం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 22, 2021 | 4:41 PM

SVBC Porn Website link: తిరుమల దేవస్థానానికి చెందిన ఎస్వీబీసీ(శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌)లో పోర్న్‌ సైట్ లింక్‌ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆ భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి ఓ పోర్న్‌ సైట్‌ వీడియోను పంపాడు. దీంతో అవాక్కైన ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డిలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వారిద్దరు సీరియస్‌ అయ్యి విచారణకు ఆదేశించారు. ( అనసూయకు మరో క్రేజీ ఆఫర్‌.. మాస్‌రాజా సినిమాలో..!)

ఈ క్రమంలో ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. పోర్న్‌ సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అలాంటి సైట్లు చూస్తున్న ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీమ్ గుర్తించింది. వీరితో పాటు కార్యాలయంలో విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్‌ టీమ్‌ గుర్తించింది. వీరందరిపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా ఈ ఘటనపై ఇంకా టీటీడీ అధికారులు స్పందించలేదు. ( కోడలిగా మాకు హారిక ఓకే: అభిజిత్‌ తల్లిదండ్రులు)