Satya Nadella: ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పరిశోధనను చేపట్టాలని అన్నారు. AI కారణంగా ఉద్యోగ నష్టాల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ, సాంకేతికత కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, అలాంటి భయాలు ఎక్కువగా ఉన్నాయని నాదెళ్ల అన్నారు. బుధవారం నాదెళ్లతో ఫైర్‌సైడ్ చాట్‌లో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ..

Satya Nadella: ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
Follow us
Subhash Goud

|

Updated on: Jan 09, 2025 | 5:19 PM

దేశంలో AI టెక్నాలజీ విషయంలో లక్షలాది మందికి నైపుణ్యాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సిఇఒ సత్య నాదెళ్ల అన్నారు. ఇండియా ఏఐ మిషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో 5 లక్షల మందికి నైపుణ్యం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో అవగాహన ఒప్పందం, AIని కొత్త ఆవిష్కరణలకు, దేశవ్యాప్తంగా వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఎంఓయూలో భాగంగా మైక్రోసాఫ్ట్, ఇండియా AI కలిసి 2026 నాటికి విద్యార్థులు, అధ్యాపకులు, డెవలపర్‌లు, ప్రభుత్వ అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సహా 500,000 మందికి వ్యక్తులకు నైపుణ్యాన్నిఅందించనున్నారు. అలాగే 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. ఎన్నడూ లేని విధంగా 3 బిలియన్‌ డాలర్లును పెట్టుబడిగా పెడుతున్నందుకు సంతోషిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ పెట్టుబడి భారత్​లో ఏఐ ఆవిష్కరణలకు ఊతం ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ విస్తరణకు పెద్దపీట వేస్తోందన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పరిశోధనను చేపట్టాలని అన్నారు. AI కారణంగా ఉద్యోగ నష్టాల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ, సాంకేతికత కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, అలాంటి భయాలు ఎక్కువగా ఉన్నాయని నాదెళ్ల అన్నారు. బుధవారం నాదెళ్లతో ఫైర్‌సైడ్ చాట్‌లో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, నకిలీ కంటెంట్‌తో సహా AI టెక్నాలజీ గురించి కూడా వెల్లడించారు. సవాళ్లు పెద్దగా మారితే కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం వెనుకాడదని అన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ కూడా ఈ చర్చలో భాగమయ్యారు.

దేశంలో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు సత్యనాదేళ్ల. దేశంలోని నలుమూలలా AI, క్లౌడ్ విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, 20 వేలమందిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అవగాహన ఒప్పందంలో భాగంగా వారు 20,000 మంది అధ్యాపకులకు ఫౌండేషన్‌ కోర్సులను అందించడానికి 10 రాష్ట్రాల్లోని 20 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు (NSTIలు)/NIELIT కేంద్రాలలో ‘AI ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఇదిలా ఉండగా, తాము అనుకున్నదానికంటే ముందే ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని, ఇదే కార్యక్రమం కింద 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌ అందించాలని లక్ష్యమని సత్యనాదెళ్ల వెల్లడించారు. ఇదిలా ఉండగా, దేశంలో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడి ప్రణాళికలపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సత్యనాదేళ్ల భేటి అయ్యారు. ఈ భేటీపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు ప్రధాని మోదీ. భారతదేశంలో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడి ప్రణాళికల గురించి తెలుసుకోవడం జరిగింది. సాంకేతికత, ఆవిష్కరణలు, AIకి సంబంధించి వివిధ అంశాలను చర్చించడం కూడా అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.

భారతదేశాన్ని AI రంగంలో అగ్రస్థానంలో ఉంచడమే కాకుండా.. ఈ AI ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రతి భారతీయుడికి ప్రయోజనం చేకూరేలా.. దేశంలో మా నిరంతర విస్తరణలో మీరు కలిసి పని చేయడం మాకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందని సత్య నాదెళ్ల అన్నారు. బెంగళూరు, ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై పలు అనుమానాలుపై క్లయింట్స్, ఇతర వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పెట్టుబడి ద్వారా మైక్రోసాఫ్ట్ 2025 నాటికి భారతదేశంలో 2 మిలియన్ల మందికి AI నైపుణ్య అవకాశాలను అందించడానికి దోహదపడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి