మోదీ లడ్డూలు రెడీ.. రిజల్ట్స్ రావడమే ఆలస్యం

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ఆపార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 23న ఫలితాలు రాగానే స్వీట్లు పంచేందుకు రెడీ అయ్యారు. పార్టీ నేతల నోరు తీపి చేసేందుకు ముంబైలో ఓ స్వీట్ షాప్‌కు రెండు వేల కిలోల లడ్డూల్ని ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఆ షాపు ఓనర్ లడ్డూలను తయారు చేసేపనిలో నిమగ్నమయ్యారు. అయితే అక్కడి పనివారంతా మెదీకి వీరాభిమానులు. దీంతో వారంతా మోదీకోసం అంటూ.. మోదీ మాస్క్‌లు ధరించి మరి […]

మోదీ లడ్డూలు రెడీ.. రిజల్ట్స్ రావడమే ఆలస్యం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 21, 2019 | 8:45 PM

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ఆపార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 23న ఫలితాలు రాగానే స్వీట్లు పంచేందుకు రెడీ అయ్యారు. పార్టీ నేతల నోరు తీపి చేసేందుకు ముంబైలో ఓ స్వీట్ షాప్‌కు రెండు వేల కిలోల లడ్డూల్ని ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఆ షాపు ఓనర్ లడ్డూలను తయారు చేసేపనిలో నిమగ్నమయ్యారు. అయితే అక్కడి పనివారంతా మెదీకి వీరాభిమానులు. దీంతో వారంతా మోదీకోసం అంటూ.. మోదీ మాస్క్‌లు ధరించి మరి లడ్డూలను తయారు చేస్తున్నారు. అయితే తయారీకి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.