కారులో వేడి తగ్గేందుకు…
దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులైతే వర్ణనాతీతం. కార్లలో ప్రయాణం చేసేవారికి కూడా ఏసీలు వేసుకున్నా ఉపశమనం పొందలేకపోతున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ఖరీదైన కారుకు ఆవు పేడ అద్దింది. అద్దాలు, లైట్లు, కంపెనీ లోగో మినహా కారు మొత్తం మందంగా ఆవు పేడ అద్దారు. నగరంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరిన నేపథ్యంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె […]
దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులైతే వర్ణనాతీతం. కార్లలో ప్రయాణం చేసేవారికి కూడా ఏసీలు వేసుకున్నా ఉపశమనం పొందలేకపోతున్నారు.
అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ఖరీదైన కారుకు ఆవు పేడ అద్దింది. అద్దాలు, లైట్లు, కంపెనీ లోగో మినహా కారు మొత్తం మందంగా ఆవు పేడ అద్దారు. నగరంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరిన నేపథ్యంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె ఈ పని చేసినట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రూపేశ్ గౌరంగదాస్ వివరించారు. ‘‘ఆవు పేడను సరైన పద్ధతిలో ఉపయోగించారు. నేనెప్పుడూ ఇలా చూడలేదు. 45 డిగ్రీల ఎండను తట్టుకొనేందుకు ఆమె ఇలా చేశారు.’’ అని పోస్టుకు జత చేశారు. ఈ కారు యజమాని సేజల్ షాహ్ తనకు తెలుసని వివరించారు. పోస్టును చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.